ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా జోస్ బట్లర్... టీమిండియాతో సిరీస్ నుంచే...
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్‌ని వైట్ బాల్ కెప్టెన్‌గా ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఇయాన్ మోర్గాన్, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ప్లేస్‌లో జోస్ బట్లర్ పగ్గాలు చేపట్టబోతున్నాడు...

‘ఇయాన్ మోర్గాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆయన ఇంగ్లీష్ వైట్ బాల్ క్రికెట్‌ని ఓ స్థాయిలో నిలిపాడు. మోర్గాన్ ఇచ్చిన స్ఫూర్తితోనే రాబోయే ఛాలెంజ్‌లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్...
Jos Buttler
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయం కారణంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేకి దూరం కాగా, ఆ మ్యాచ్‌కి సారథిగా వ్యవహరించాడు జోస్ బట్లర్. ఐదో టెస్టు ముగిసిన తర్వాత టీమిండియాతో జరిగే టీ20, వన్డే సిరీస్... జోస్ బట్లర్‌కి పూర్తి స్థాయి వైట్ బాల్ కెప్టెన్‌గా మొట్టమొదటి సిరీస్ కానుంది...
ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీతో పాటు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..
ఇంగ్లాండ్ తరుపున 2011లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 31 ఏళ్ల జోస్ బట్లర్, ఇప్పటిదాకా 151 వన్డేలు ఆడి 41.20 సగటుతో 4120 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 88 టీ20 మ్యాచుల్లో 34.51 సగటుతో 2140 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
Jos Buttler
వికెట్ కీపర్‌గా వైట్ బాల్ ఫార్మాట్‌లో 222 క్యాచులు అందుకున్న జోస్ బట్లర్, 43 స్టంపౌట్లు చేశాడు. టెస్టుల్లో 57 మ్యాచులు ఆడిన జోస్ బట్లర్, 31.94 సగటుతో 2907 పరుగులు చేశాడు. వైట్ బాల్ సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు వీలుగా ఇండియాతో జరిగే ఐదో టెస్టుకి జోస్ బట్లర్‌ని ఎంపిక చేయలేదు...
Image credit: PTI
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జోస్ బట్లర్, 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడి 57.53 సగటుతో 863 పరుగులు చేశాడు. సీజన్‌లో 4 సెంచరీలు బాదిన జోస్ బట్లర్, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (2016 సీజన్) తర్వాతి స్థానంలో నిలిచాడు...
Rohit Sharma
కరోనా పాజిటివ్‌గా తేలి, ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి అందుబాటులో లేకుండా పోయిన భారత సారథి రోహిత్ శర్మ, వైట్ బాల్ సిరీస్ సమయానికి జట్టుకి అందుబాటులోకి రాబోతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది టీమిండియా.