MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Jonny Bairstow: పట్ట పగ్గాల్లేని బెయిర్ స్టో.. మూడో టెస్టులోనూ అదే బాదుడు.. కివీస్ కు ఆశాభంగం

Jonny Bairstow: పట్ట పగ్గాల్లేని బెయిర్ స్టో.. మూడో టెస్టులోనూ అదే బాదుడు.. కివీస్ కు ఆశాభంగం

ENG vs NZ 3rd Test: తొలి రెండు టెస్టులలో ఓడి మూడో టెస్టులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతున్న న్యూజిలాండ్ కు  ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో షాక్ ఇచ్చాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Jun 25 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్టు లో  55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆతిథ్య జట్టును జానీ బెయిర్ స్టో మళ్లీ ఆదుకున్నాడు. రెండో టెస్టులో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఊది పారేసిన బెయిర్ స్టో.. మూడో టెస్టులో కూడా అదే ఆటను కొనసాగించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కివీస్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లంతా  పెవిలియన్ కు క్యూ కడుతున్న వేళ బెయిర్ స్టో చెలరేగాడు. 95 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 126 బంతుల్లోనే 21 ఫోర్లతో 130 పరుగులు సాధించాడు. 

36

అతడికి తోడుగా తొలి టెస్టు ఆడుతున్న జెమీ ఓవర్టన్ (106 బంతుల్లో 89.. 12 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడటంతో  శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 49 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. 

46

అంతకుముందు న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ ఈ  సిరీస్ లో వరుసగా మూడో సెంచరీ సాధించడంతో కివీస్.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అతడికి తోడుగా టామ్ బ్లండెల్ (55) కూడా రాణించడంతో  న్యూజిలాండ్.. గౌరవప్రద స్కోరు చేసింది. 

56

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టుకు ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ షాకులిచ్చారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (4), జాక్ క్రాలే (6) లతో పాటు ఓలీ పోప్ (5) లను బౌల్ట్ పెవిలియన్ కు పంపాడు. జో రూట్ (5) ను సౌథీ ఔట్ చేయగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (18), వికెట్ కీపర్ బెన్ పోక్స్ (0) లను వాగ్నర్ ఔట్ చేశాడు. 

66

55 కే 6 వికెట్లు పడ్డ క్రమంలో ఓవర్టన్ తో జతకలిసిన బెయిర్ స్టో.. ఓవర్టన్ తో కలిసి అభేద్యమైన 7 వికెట్ కు 209 పరుగులు జోడించి నాటౌట్ గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కంటే ఇంగ్లాండ్ ఇంకా 65 పరుగులే వెనుకబడి ఉంది.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved