జేమ్స్ అండర్సన్ షాకింగ్ నిర్ణయం... టీమిండియాతో జరిగే ఆ టెస్టు తర్వాత రిటైర్మెంట్...
39 ఏళ్ల వయసులోనూ తన బౌలింగ్‌తో టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్నాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్. ఇండియా- ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టును ఎక్కువగా ఇబ్బందిపెట్టిన బౌలర్ అండర్సన్, రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయానికి వచ్చాడట..
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే కెఎల్ రాహుల్‌ను డకౌట్ చేసిన జిమ్మీ అండర్సన్, ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ వికెట్లు తీసి, టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలుచేశాడు...
రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకుంటున్న అజింక రహానేను అవుట్ చేసిన అండర్సన్, మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి అదరగొట్టాడు...
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న జిమ్మీ అండర్సన్, తన రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయం తీసుకున్నాడట...
‘నేను ఓ ఫన్నీ ఫీలింగ్‌లో ఉన్నా, అదేంటో కూడా నాకు తెలీదు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఐదో టెస్టు తర్వాత జిమ్మీ అండర్సన్ రిటైర్ అవుతాడని నాకు అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టీవ్ హార్మిసన్...
రొటేషన్ పాలసీ కారణంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లకు వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి విశ్రాంతినిచ్చింది ఇంగ్లాండ్... అయితే ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు ఆడాడు అండర్సన్...
స్టువర్ట్ బ్రాడ్ తొలి టెస్టులో గాయపడడం, జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్‌కి విశ్రాంతినిచ్చే ఆలోచన కూడా చేయలేదు ఇంగ్లాండ్..
టెస్టుల్లో 630 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, అనిల్ కుంబ్లేని అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ నిలిచాడు. అంతేకాకుండా అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా, టాప్ 4లో ఉన్న ఏకైక పేసర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...
ఇప్పటికే 165 టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ తరుపున అత్యధక టెస్టు మ్యాచులు ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు. రికార్డు స్తాయిలో 31సార్లు ఐదేసి వికెట్లు తీసిన అండర్సన్, 2003లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు..
అండర్సన్, టీమిండియా టెస్టు సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే... యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకి కష్టాలు ఎదురుకావచ్చు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కి దూరమయ్యాడు...
తొలి టెస్టులో గాయపడిన స్టువర్ట్ బ్రాడ్ గాయం నుంచి కోలుకున్నా, అండర్సన్ లేకుండా అతని పర్ఫామెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పలేం... కాబట్టి అండర్సన్ రిటైర్మెంట్ ఆలోచన చేసినా, అది యాషెస్ సిరీస్ తర్వాతే ఉండొచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..