కోహ్లీకి షాక్ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా... ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్‌గా రికార్డు...
First Published Dec 27, 2020, 5:48 AM IST
బూమ్... బూమ్... బుమ్రా... విరాట్ కోహ్లీని దాటేశాడు. వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే విరాట్ కోహ్లీ కంటే బుమ్రా అత్యధిక ఆదాయం సంపాదించిన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీతో పోలిస్తే బుమ్రా చేసే యాడ్స్ చాలా తక్కువ, మరి ఇదేలా సాధ్యం? మొత్తంగా కాదు... అంతర్జాతీయ మ్యాచుల ద్వారా అధికారికంగా బీసీసీఐ నుంచి పారితోషికంలో మాత్రమే కోహ్లీ కంటే బుమ్రా ముందున్నాడు.

భారత ప్లేయర్లకు గ్రేటింగ్ ఆధారంగా ఏడాదికి ఇంత అంటూ పారితోషికం చెల్లిస్తోంది బీసీసీఐ. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లు ఆడే టాప్ స్టార్లకు అత్యధికంగా ఏడాదికి ఏడు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ మొత్తంగా చెల్లిస్తారు.

ఇది కాకుండా మ్యాచు ఫీజు కింద ఆడిన మ్యాచులకు పారితోషికం దక్కుతుంది. ఒక్క టెస్టు మ్యాచుకి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్ ఆడితే 3 లక్షలు మ్యాచు ఫీజు కింద దక్కుతుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?