MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Prithvi Shaw: ఇంకా కోలుకోని షా.. మిగిలిన లీగ్ మ్యాచులకూ దూరం.. ఢిల్లీకి కోలుకోని దెబ్బ

Prithvi Shaw: ఇంకా కోలుకోని షా.. మిగిలిన లీగ్ మ్యాచులకూ దూరం.. ఢిల్లీకి కోలుకోని దెబ్బ

IPL 2022: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. తర్వాత ఆడబోయే రెండు మ్యాచులు గెలిస్తే తప్ప  ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు లేవంటే తాజాగా ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తాకింది. 

2 Min read
Author : Srinivas M
| Updated : May 13 2022, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్లేఆఫ్స్ కలలు కంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సీజన్ మొత్తం పడుతూ లేస్తూ వస్తున్న ఆ జట్టుకు ఇప్పుడు స్టార్ ఓపెనర్ దూరమయ్యాడు.

27

టైఫాయిడ్ తో బాధపడుతున్న ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా తర్వాత రెండు మ్యాచులకు కూడా అందుబాటులో ఉండడని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్  తెలిపాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే ఢిల్లీకి తర్వాత రెండు మ్యాచులు తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్థితి.

37

షా ఆరోగ్య పరిస్థితిపై వాట్సన్ మాట్లాడుతూ.. ‘అతడి చికిత్స ఎలా జరుగుతున్నదో నాకైతే తెలియదు. కానీ  కొన్ని రోజులుగా అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యులు అతడికి డయాగ్నోసిస్ నిర్వహిస్తున్నారు..

47

జ్వరంతో షా జట్టుకు దూరమవడం మాకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అదీగాక ఇప్పుడు మేము ప్లేఆఫ్స్ రేసులో  కీలక మ్యాచులు ఆడనున్న వేళ.. అతడు దూరం కావడం మాకు ఎదురుదెబ్బే.

57

షా అద్భుతమైన ఆటగాడు. ప్రపంచంలోని గొప్ప బౌలర్లను సైతం  దూకుడుగా ఆడి వేగంగా పరుగులు సాధించడంలో దిట్ట. అలాంటి ఆటగాడు కీలక సమయంలో దూరమవడం మాకు  ఇబ్బందికరం. అతడి సేవలు కోల్పోవడం మాకు తీరని నష్టం...’ అని తెలిపాడు.

67

ఈ సీజన్ లో 9 మ్యాచులాడిన  పృథ్వీ షా.. 259 పరుగులు చేశాడు.  అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఢిల్లీ ఆడిన గత మూడు మ్యాచుల నుంచి షా ఆడలేదు. దాంతో డేవిడ్ వార్నర్ కు సరైన పార్ట్నర్ దొరకక  ఢిల్లీ   పవర్ ప్లేలో అనుకున్నంతగా రాణించడం లేదు.

77

ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ తో ముగిసిన మ్యాచ్ లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.   మే 16న ఆ జట్టు పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఆ తర్వాత మే 21న ముంబై ఇండియన్స్ తో కూడా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులు గెలిస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరేది.  లేకుంటే మరోసారి ఆ జట్టుకు మిగిలేది శూణ్యహస్తమే...

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం
Recommended image2
విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాళ్ల జోరు.. దెబ్బకు సెలెక్టర్లు బేజారు..
Recommended image3
జైస్వాల్‌కు రాజస్థాన్ షాక్.. కెప్టెన్సీ కోసం మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved