MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఏంటి.. రిషభ్‌కు యాక్సిడెంట్ అయిందా..? ఎప్పుడు..? పంత్ ఫ్రెండ్ కామెంట్స్

ఏంటి.. రిషభ్‌కు యాక్సిడెంట్ అయిందా..? ఎప్పుడు..? పంత్ ఫ్రెండ్ కామెంట్స్

Rishabh Pant Car Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో పంత్ కారు నుజ్జునుజ్జుకాగా అతడు ప్రస్తుతం  డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్నాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jan 02 2023, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నాలుగు రోజుల క్రితం (శుక్రవారం) తన తల్లిని కలవడానికి వెళ్తూ    ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలో రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. తీవ్ర గాయాలపాలైన విషయం క్రికెట్ ప్రేమికులతో పాటు అందరినీ  ఆందోళనకు గురిచేసింది. రిషభ్ పంత్ ఆరోగ్యం బాగుండాలని, అతడు త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు  అతడి శ్రేయోభిలాషులూ కోరుకుంటున్నారు.  

27

అయితే పంత్ కు  ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా తనకు విషయం తెలియదంటున్నాడు అతడి క్లోజ్ ఫ్రెండ్ ఇషాన్ కిషన్. ప్రస్తుతం రంజీలు ఆడుతున్న ఇషాన్ కు  ఈ విషయం గురించి  మ్యాచ్ చూడటానికి వచ్చిన  ప్రేక్షకులు చెప్పడంతో అతడు.. అవునా..?  అన్నట్టుగా చూశాడు. 

37

పంత్, ఇషాన్ కిషన్ లు టీమిండియా అండర్ - 19 టీమ్ కు కలిసిఆడారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.  అయితే  పంత్ కు  యాక్సిడెంట్ అయిన విషయం మాత్రం   ఇషాన్ తనకు తెలియదన్నట్టుగా   పేర్కొనడం గమనార్హం.  

47

రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ ప్రస్తుతం సర్వీసెస్ తో మ్యాచ్ లో బరిలోకి దిగాడు. మ్యాచ్ మధ్యలో ఇషాన్..  అక్కడికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు దిగాడు. ఆ క్రమంలో  ఓ అభిమాని.. ‘భయ్యా, రిషభ్ పంత్ కు  యాక్సిడెంట్ అయింది తెలుసా..?’ అని అడిగాడు. 

57

దానికి ఇషాన్.. ‘ఏంటి..? ఎప్పుడు..?’ అని నివ్వెరపోయాడు.  అప్పుడు ఫ్యాన్స్.. మూడు రోజులైంది అని చెప్పాడు. అతడే కొనసాగిస్తూ.. పంత్ ఇప్పుడు బాగానే ఉన్నాడని,  ప్రమాదమేమీ లేదని  అన్నాడు.  దాంతో ఇషాన్.. ‘ఓకే’ అన్నట్టుగా  వారితో ఫోటోలు దిగి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

67

ఇక పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని, అతడు కోలుకుంటున్నాడని  డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.   అతడి ఆరోగ్యం మెరుగవుతున్నదని, అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డ్ కు మార్చినట్టు చెప్పాయి.   పంత్ పూర్తిస్థాయిలో కోలుకునేదాకా  మ్యాక్స్ హాస్పిటల్ లోనే చికిత్స ఉంటుందని పేర్కొన్నాయి.  

77

పంత్ ఆరోగ్యంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా  ఆదివారం ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.  

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
జింబాబ్వేపై థండర్ విక్టరీ.. ఏం లాభం.! మూడో ప్లేస్‌లోనే మిగిలిపోయిన టీమిండియా
Recommended image2
30 బంతుల్లో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు
Recommended image3
IND vs ZIM : హార్దిక్, అభిషేక్ మాస్ విధ్వంసం.. జింబాబ్వేపై టీమిండియా గెలుపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved