Ishan Kishan: "ఆ ఛాన్స్ రాక చాలా బాధ పడ్డా.. అందుకే కసితో ఇలా ఆడుతున్నా!"
Ishan Kishan: టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీసులో వరుసగా రెండు మ్యాచుల్లో అర్థ శతకాలతో ఆకట్టుకున్నాడు. వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ ఆడిన జట్టులో కిషన్ కూడా భాగస్వామి. కానీ అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ సందర్భం గురించి ఏమంటారంటే..?
Ishan Kishan
Ishan Kishan: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యంగ్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించిన యంగ్ టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ ముంగిట కొండంత లక్ష్యాన్ని ఉంచి విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ హాఫ్ సెంచరీ చేసి మెరిశాడు ఓ యంగ్ బ్యాట్స్ మెన్.. అతడే ఇషాన్ కిషన్.
Ishan Kishan
మంచి ఫామ్ లో ఉన్న ఈ యంగ్ బ్యాట్స్ మెన్.. వన్‌డౌన్‌లో వస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ప్రస్తుతం టోర్నీలో దుమ్మురేపుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో 39 బంతుల్లో 58 పరుగులు చేసిన కిషన్, తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్‌లో 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
Ishan Kishan
వాస్తవానికి వన్డే ప్రపంచకప్ 2023లోని భారత జట్టులో భాగమైనప్పటికీ కిషన్ కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. డెంగ్యూ కారణంగా శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ కి దూరంగా కాగా.. ఇషాన్ కిషన్ కు రెండు ఆడే అవకాశం లభించింది. అయితే గిల్ తిరిగి వచ్చిన తర్వాత.. ప్లేయింగ్-11 నుండి తొలగించబడ్డాడు. టోర్నమెంట్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నీని చివరి(సెమీ ఫైనల్) వరకూ ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. కానీ, ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.
Ishan Kishan
తాజాగా ఇషాన్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ.. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో బయటపెట్టాడు. అలాగే.. ప్రపంచ కప్ లో ఆడే అవకాశం రాకపోవడంపై, టీమిండియాకు సెలక్ట్ అయినా బెంచ్ కే పరిమితమైన సందర్భంలో తన అనుభవించిన బాధను తెలిపారు టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఇదంతా కసితోనే అని అనుకుంటున్నా.. ప్రపంచకప్‌లో మేం చాంపియన్ టీమ్‌లా ఆడామని, కానీ, అందుతో ఆడే అవకాశాన్ని మిస్ అయ్యానని బాధపడ్డారు.
Ishan Kishan
కానీ, గడిచిన కాలం, పొగొట్టుకున్న అవకాశాన్ని తిరిగి రాబట్టుకోలే కదా.. జట్టులో చోటు ఉండి ఆడలేని కిష్ట పరిస్థితి ఎదుర్కొన్నానని అన్నారు. అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. సమయం వచ్చినప్పుడు, మీకు అవకాశం వచ్చినప్పుడు మళ్లీ ఫ్రెష్ మైండ్ తో బరిలో దిగాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా చూసుకోవాలని కిషన్ చెప్పుకొచ్చాడు.
Ishan Kishan
టీమ్ లో ఆడకుండా.. బయటి నుంచి ఆటను చూస్తున్నప్పుడు పెద్ద పెద్దలు ఎలా ఆడతారో చూడాలి అని కిషన్ అన్నాడు. వారు గేమ్‌ను ఎలా తీసుకెళ్తున్నారు. బౌలర్లను ఎలా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాలు చాలా సహాయపడతాయని తెలిపారు. మంచి ఫామ్ లో ఉన్నా.. కిషన్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో ఆసీస్‌పై సత్తా చాటాడు.వెస్టిండీస్, USAలలో వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ భారత్ కు ఓ ఒక కీలక సన్నాహక మ్యాచ్ గా మారింది.