- Home
- Sports
- Cricket
- ధోనీ అప్పుడు, ఇషాన్ కిషన్ ఇప్పుడు... ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు కొట్టేసిన రోహిత్ శర్మ...
ధోనీ అప్పుడు, ఇషాన్ కిషన్ ఇప్పుడు... ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు కొట్టేసిన రోహిత్ శర్మ...
టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రేకుల్లేకుండా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ... తాజాగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లోనూ ఒకే ఇన్నింగ్స్‌లో మూడు రికార్డులు క్రియేట్ చేశాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్...

లంకతో జరిగిన మొదటి టీ20లో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి టీమిండియాకి శతాధిక భాగస్వామ్యాన్ని అందించారు. టీ20ల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో 13 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పితే, రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసి టాప్‌లోకి దూసుకెళ్లాడు.
తొలి వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ 3299 టీ20 పరుగులతో ఉంటే, అతన్ని అధిగమించిన రోహిత్ శర్మ 3307 పరుగులతో టాప్‌లో నిలిచాడు...
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3296 పరుగులతో టాప్ 3లో ఉన్నాడు. టీ20ల్లో రోహిత్ శర్మకి ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం.
32 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు బౌల్డ్ అయిన భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...
రోహిత్ శర్మ 14 సార్లు బౌల్డ్ అయితే శిఖర్ ధావన్ 14 సార్లు, ఎమ్మెస్ ధోనీ 13, సురేష్ రైనా 11, కెఎల్ రాహుల్ 10 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు...
30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఇషాన్ కిషన్. ఆరంగ్రేటం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కి, ఇది కెరీర్‌లో రెండో టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం.
89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.ఇంతకుముందు వెస్టిండీస్‌పై 2019లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ రికార్డును బ్రేక్ చేశాడు ఇషాన్ కిషన్...
2013, ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాపై టెస్టులో 224 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు..
సరిగ్గా 9 ఏళ్లకు జార్ఖండ్‌కే చెందిన ఇషాన్ కిషన్, శ్రీలంకపై 89 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం...
23 ఏళ్ల ఇషాన్ కిషన్, అతి పిన్న వయసులో అత్యంత వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. సురేష్ రైనా తన 23 ఏళ్ల వయసులో 101 పరుగులు చేస్తే, ఇషాన్ 89 పరుగులతో టాప్ 2లో నిలిచాడు...