- Home
- Sports
- Cricket
- మనోడికి మరో ఛాన్స్ దక్కుతుందా? శ్రీకర్ భరత్ లేదా ఇషాన్ కిషన్... విండీస్ టూర్‌లో వికెట్ కీపర్ ఎవరు?...
మనోడికి మరో ఛాన్స్ దక్కుతుందా? శ్రీకర్ భరత్ లేదా ఇషాన్ కిషన్... విండీస్ టూర్‌లో వికెట్ కీపర్ ఎవరు?...
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడడంతో టెస్టుల్లో సరైన వికెట్ కీపర్ కోసం వెతుకులాడుతోంది టీమిండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో శ్రీకర్ భరత్ వికెట్ కీపింగ్ చేశాడు...

వికెట్ల వెనకాల అటు ఇటు దూకుతూ వికెట్ కీపింగ్‌లో బాగానే ఇంప్రెస్ చేసిన శ్రీకర్ భరత్, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. మొత్తంగా 4 టెస్టుల్లో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రీకర్ భరత్, ఇప్పటిదాకా హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు..
Srikar Bharat
డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి అవుటైన శ్రీకర్ భరత్, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేశాడు. అయితే రిషబ్ పంత్‌కి సరైన రిప్లేస్‌మెంట్‌గా మాత్రం అనిపించలేదు. దీంతో వెస్టిండీస్ టూర్‌లో శ్రీకర్ భరత్‌కి అవకాశం దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...
Ishan Kishan
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి స్టాండ్ బై వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్, వెస్టిండీస్ టూర్‌లో తనకి కచ్ఛితంగా చోటు దక్కుతుందని నమ్మకంగా ఉన్నాడు. అందుకే దులీప్ ట్రోఫీలో ఆడడానికి కూడా ఇషాన్ కిషన్ ఇష్టపడలేదు..
మరోవైపు శ్రీకర్ భరత్‌కి మాత్రం దులీప్ ట్రోఫీ కోసం సౌత్ జోన్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. దీంతో శ్రీకర్ భరత్‌కి విండీస్ టూర్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.
. 4 టెస్టుల్లో భరత్ నుంచి బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాకపోవడంతో సెలక్టర్లు, ఇషాన్ కిషన్‌ని ట్రై చేయాలని చూస్తున్నారా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది..
జూలై 12 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం జూలై 3న విమానం ఎక్కనుంది టీమిండియా. ఈ వారంలో వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లకు సంబంధించిన జట్లను ప్రకటించి, ఆ తర్వాత టీ20 సిరీస్‌ని ప్రకటించబోతున్నారు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని, సీనియర్లను పక్కనబెట్టి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తుండడంతో వెస్టిండీస్ టూర్‌కి ప్రకటించే జట్టులో ఎవరెవరికి అవకాశం దక్కుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు యంగ్ క్రికెటర్లు..