ఏందయ్యా ఇదీ... హార్దిక్ పాండ్యా మళ్ళీ తండ్రి కాబోతున్నాడా?: భార్య నటాషా ప్రెగ్నెన్సీ ఫోటో వైరల్
ఇటీవలే పెళ్లి కాకుండానే టీమిండియా క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా తండ్రి అయిన విషయం తెలిసిందే.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రస్తుతం భారత క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న బిగ్ క్రికెట్ ఈవెంట్. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఎంటర్టైన్ మెంట్ కు దూరమైన ప్రజలను ముఖ్యంగా క్రికెట్ అభిమానులను అలరిస్తోంది ఐపిఎల్ సీజన్ 13. ఇలా ఈ ఏడాది సరికొత్తగా సాగుతున్న ఐపిఎల్ మైదానంలో జరిగిన మ్యాచ్ విశేషాలతోనే కాదు మైదానం బయట జరిగే విషయాలతో బాగా ప్రాచుర్యాన్ని పొందుతోంది. గత అన్ని ఐపిఎల్ సీజన్లలో ఆటగాళ్ళ భార్యా పిల్లలు మైదానంలో సందడి చేయగా కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ కొంతమంది క్రికెటర్లు, వారి భార్యలు సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరి ప్రేమను వ్యక్తపర్చుకుంటూ చేస్తున్న పోస్టులు కొన్ని వైరల్ గా మారుతున్నారు.
ఇటీవలే పెళ్లి కాకుండానే టీమిండియా క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో భార్య నటాషా, కొడుకు అగస్త్యలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేకుండా అతడు ఐపిఎల్ టోర్నీ ఆడటానికి దుబాయ్ పయనమవ్వాల్సి వచ్చింది. దీంతో భర్తను మిస్ అవుతున్న నటషా పాత జ్ఞాపకాలను నెమరెవేసుకుంటు ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ అభిమానులను కన్ప్యూజన్ కు గురిచేసింది.
బ్లాక్ డ్రెస్ లో అందంగా ముస్తాబయిన వీడియోను హార్దిక్ భార్య నటాషా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో నటాషా గర్భంతో వున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ వీడియో అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టించింది. దీంతో ఈ వీడియోకు విపరీతంగా కామెంట్స్ వస్తున్నారు. కొంపదీసి హార్దిక్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? అని నటాషాను కొందరు నేరుగా ప్రశ్నించారు.
అభిమానుల నుండి ప్రశ్నల తాకిడి ఎక్కువ అవడంతో ఈ వీడియోపై నటాషా క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పడిది కాదని... అగస్త్య కడుపులో వున్నప్పటిదంటూ తెలిపింది. భర్త హార్దిక్ కు దూరంగా వుండటంతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో పోస్ట్ చేసినట్లు నటాషా వివరించారు.
ఈ ఏడాది జనవరి ఫస్ట్ న నటాషాతో సాగుతున్న ప్రేమ ప్రయాణాన్ని హార్దిక్ పాండ్యా బయటపెట్టాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ఎంగెజ్ మెంట్ కూడా అయిపోయినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత కొన్నిరోజులకే తన ప్రియురాలు నటాషా ప్రెగ్నెంట్ అంటూ బాంబు పేల్చాడు. ఇలా గర్భవతి అయిన ప్రియురాలిని పెళ్లాడాడు హార్దిక్. ఈ పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది కూడా.
తమ పెళ్లి వ్యవహారంపై కొన్ని విమర్శలు వచ్చినా హార్దిక్ దంపతులు వాటిని పట్టించుకోలేదు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి జీవితాల్లో మరింత సంతోషాన్ని పంచుతూ అగస్త్య ప్రవేశించాడు.