MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2022 మెగా వేలంలో మెరిసిన తెలుగు తేజం తిలక్ వర్మ... ఎవరీ కుర్రాడు? ఎందుకింత డిమాండ్...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మెరిసిన తెలుగు తేజం తిలక్ వర్మ... ఎవరీ కుర్రాడు? ఎందుకింత డిమాండ్...

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఓ తెలుగు కుర్రాడి కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌‌తో పాటు  ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా పోటీపడిన ఆ కుర్రాడి పేరు ఎన్ తిలక్ వర్మ... ఎవరీ తిలక్ వర్మ, అతనికి ఎందుకు ఇంత డిమాండ్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 14 2022, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఐపీఎల్ 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టు, రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డేవాల్డ్ బ్రేవిస్, కిరన్ పోలార్డ్, టిమ్ డేవిడ్ వంటి బ్యాటర్లతో కలిసి బ్యాటింగ్ చేయనున్నాడు తిలక్ వర్మ...

39

అండర్-19 వరల్డ్ కప్ 2020 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు తిలక్ వర్మ.  టోర్నీలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు..

49

2002, నవంబర్ 8న హైదరాబాద్‌లో జన్మించిన తిలక్ వర్మ వయసు 19 ఏళ్లు. ఆరు అడుగుల పొడవుండే ఈ కుర్రాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం విశేషం...

59

టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే తిలక్ వర్మ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, బ్రేవిస్ వంటి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లతో లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌గా వాడొచ్చని ముంబై ఇండియన్స్ భావించి ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా..

69

దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో టీ20 ఫార్మాట్‌లో 15 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 143.77 సగటుతో 381 పరుగులు చేశాడు. తిలక్ వర్మ యావరేజ్ 30..

79

15 మ్యాచుల్లో 28 ఫోర్లు, 17 సిక్సర్లు బాదిన తిలక్ వర్మ, మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు...

89

16 లిస్టు ఏ మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 784 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 156 పరుగులు నాటౌట్. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 52.25... బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీశాడు...

99

విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో హైదరాబాద్ తరుపున ఆడి, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగులు చేసిన తిలక్ వర్మ, ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి... ఐపీఎల్ 2022 ద్వారా ఆరంగ్రేటం చేయబోతున్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved