ఐపీఎల్ 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే.. కుర్రాళ్లతో నిండిపోయిన...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, మిగిలిన జట్లకు భిన్నంగా యువ క్రికెటర్లను కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కెప్టెన్ కేన్ విలియంసన్ మినహా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్, వేలంలోనూ కుర్రాళ్లపైనే ఎక్కువ ఆసక్తి చూపించింది...

అండర్-19 వరల్డ్ కప్ 2020 కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు తిరిగి కొనుగోలు చేసిన అభిషేక్ శర్మ కోసం ఏకంగా రూ.6.5 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది.
గత సీజన్‌లో అదరగొట్టిన అండర్-19 వరల్డ్ కప్ 2020 బౌలర్ కార్తీక్ త్యాగిని రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, భువనేశ్వర్ కుమార్‌ను రూ.4.2 కోట్లకు తిరిగి దక్కించుకుంది...
శ్రేయాస్ గోపాల్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, రాహుల్ త్రిపాఠి కోసం ఏకంగా రూ.8.5 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది...
జగదీశ సుచిత్‌ను రూ.20 లక్షలకు తిరిగి తెచ్చుకున్న ఎస్ఆర్‌హెచ్, విండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కోసం ఏకంగా రూ.10.75 కోట్ల భారీ మొత్తం వెచ్చించింది...
భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ, టి. నటరాజన్‌ను రూ.4 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది...
అయిడిన్ మార్క్‌రమ్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, గ్లెన్ ఫిలిప్స్‌ను బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది.
సౌతాఫ్రికా యంగ్ పేసర్ మార్కో జాన్సెన్‌ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ, విండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ కోసం ఏకంగా రూ.7.75 కోట్లు ఖర్చు చేసింది...
సీన్ అబ్బాట్‌ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్ టీమ్, విష్ణు వినోద్‌ను రూ.50 లక్షలకు, ఆర్ సమర్థ్‌ను రూ.20 లక్షలకు శశాంక్ సింగ్‌ను రూ.20 లక్షలకు, సౌరబ్ దూబేని రూ.20 లక్షలకు, ఫజల్ హక్ ఫరూకీని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది...
మొత్తంగా 2022 సీజన్ ఆడబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలియంసన్, భువనేశ్వర్ కుమార్‌లకి మాత్రమే మంచి అంతర్జాతీయ అనుభవం ఉంది...
నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్లకు కాస్తో కూస్తో అంతర్జాతీయ అనుభవం ఉంటే మార్కో జాన్సెన్, టి నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్, సీన్ అబ్బాట్, రొమారియో షెఫర్డ్, గ్లెన్ ఫిలిప్స్, ఫరూకీ వంటి ప్లేయర్లు ఈ మధ్యే కెరీర్ మొదలెట్టినవాళ్లు...
కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ వంటి మెజారిటీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు, ఇంతవరకూ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు ఇది: కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హక్ ఫరూకీ