- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి చూపు ఆ జట్టు పైనే... ఇప్పటిదాకా వేలంలో రూ.10 కోట్లు పెట్టని...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అందరి చూపు ఆ జట్టు పైనే... ఇప్పటిదాకా వేలంలో రూ.10 కోట్లు పెట్టని...
ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ. గత 9 సీజన్లలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10 కోట్లు కూడా ఖర్చు పెట్టింది లేదు. అతి తక్కువ ఖర్చులో ప్లేయర్లను కొని, వారిని స్టార్లుగా మలచడమే ముంబై స్ట్రాటెజీ...

ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక ధర వెచ్చించింది ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గురించే. మొదటి మూడు సీజన్లు డెక్కన్ ఛార్జర్స్‌కి ఆడిన రోహిత్ శర్మను, ఐపీఎల్ 2011 వేలంలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
2018 ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాని రూ.8.8 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2022 సీజన్‌కి అతన్ని రిటైన్ చేసుకోలేదు...
ఐపీఎల్ 2020 సీజన్‌లో నాథన్ కౌంటర్‌నైల్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, అతన్ని రెండు సీజన్లలో కలిపి 12 మ్యాచుల్లో మాత్రమే ఆడించింది..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఐపీఎల్ 2013 వేలంలో రూ.6.3 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతని పర్ఫామెన్స్‌తో సంతృప్తి చెందకపోవడంతో ఆ తర్వాతి సీజన్‌లోనే వేలానికి విడుదల చేసింది...
ఐపీఎల్ 2018 సీజన్‌లో ఇషాన్ కిషన్‌ను రూ.6.2 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అంతకుముందు రెండు సీజన్లలో గుజరాత్ లయన్స్‌కి ఆడిన ఇషాన్ కిషన్, ముంబై ఇండియన్స్ తరుపున అదరగొట్టాడు..
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్ జట్టు వేలానికి వదిలేసిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే...
ఇషాన్ కిషన్‌ను తిరిగి కొనుగోలు చేయాలన్నా రూ.10+ కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి ముంబై ఇండియన్స్. అతనితో పాటు రాహుల్ చాహార్, క్రిస్ లీన్, క్వింటన్ డి కాక్ వంటి ప్లేయర్లు భారీ ధర దక్కించుకునే అవకాశం ఉంది...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను రూ.16 కోట్లకు, జస్ప్రిత్ బుమ్రాను రూ.12 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, కిరన్ పోలార్డ్‌కి రూ.6 కోట్లు చెల్లించనుంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పర్సులో రూ.48 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ముంబై ఎలా వాడబోతోంది, ఏ ప్లేయర్లను కొనుగోలు చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది...
ఇంతవరకూ ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్ కోసం రూ.10+ కోట్లు చెల్లించని ముంబై ఇండియన్స్, ఈసారి మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేయడం పక్కా అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...