MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 RR vs MI: కీ మ్యాచ్‌లో రాయల్స్ అట్టర్ ఫ్లాప్... ముంబై ఇండియన్స్ ముందు ఈజీ టార్గెట్...

IPL2021 RR vs MI: కీ మ్యాచ్‌లో రాయల్స్ అట్టర్ ఫ్లాప్... ముంబై ఇండియన్స్ ముందు ఈజీ టార్గెట్...

ఐపీఎల్ 2021: లేట్ అయినా ప్లేఆఫ్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బౌలర్లు... రాజస్థాన్ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి, స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 05 2021, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 190 పరుగుల టార్గెట్‌ను 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన రాజస్థాన్ రాయల్స్, కీలక మ్యాచ్‌లో చతికిలబడుతోంది... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లలో 9 వికెటలు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

గత మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, 9 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి కౌంటర్‌నైల్ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆ తర్వాత 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన ఇవిన్ లూయిస్‌ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

38

41 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. 6 బంతుల్లో 3 పరుగులు చేసిన సంజూ శాంసన్, 8 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబేలను జేమ్స్ నీశమ్ పెవిలియన్‌కి చేర్చాడు...

48

ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్ కూడా 13 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి కౌంటర్‌నైల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో 50 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్...

58

20 బంతుల్లో 12 పరుగులు చేసి, ఆరో వికెట్‌కి 21 పరుగులు జోడంచిన రాహుల్ తెవాటియా కూడా నీశమ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

68

ఆ తర్వాత శ్రేయాస్ గోపాల్‌ను బుమ్రా డకౌట్ చేయగా... 23 బంతుల్లో 15 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ను కౌంటర్‌నైల్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు...

78

11 బంతుల్లో ఓ లక్కీ ఫోర్‌తో 6 పరుగులు చేసిన చేతన్ సకారియాను బౌల్డ్ చేశాడు కౌంటర్‌నైల్. ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ సిక్సర్ బాదడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్...

88

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులకి ఆలౌట్ అయ్యింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్ వరల్డ్ కప్ సమరానికి డేట్ ఫిక్స్.. దాయాదుల ఫైట్ మామూలుగా ఉండదు!
Recommended image2
IPL 2026 : వేపింగ్.. హనీ ట్రాప్ లో ఐపీఎల్ స్టార్స్? బీసీసీఐ 8 పేజీల లెటర్ లో ఏముందంటే?
Recommended image3
IPL 2026: టాప్ గేర్‌లో సన్‌రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్‌లోకి హైదరాబాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved