KL Rahul: రాహుల్ కెప్టెన్సీపై పంజాబ్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తి.. వచ్చే ఏడాది ఆ జట్టుతో ఆడేది డౌటే..!
IPL2021 Punjab Super Kings: ఐపీఎల్ లో ఇంతవరకు కప్ కొట్టని జట్లలో పంజాబ్ సూపర్ కింగ్స్ ఒకటి. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లున్నా పంజాబ్ భవితవ్యం మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడా..? వచ్చే సీజన్ లో ఆ జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు మరికొంతమంది ఆటగాళ్లు రానున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఉద్వాసన పలుకనున్నదని సమాచారం.
ఇదే విషయమై ఇప్పటికే PBKS యాజమాన్యం రాహుల్ తో దీనిపై చర్చించిందని తెలుస్తున్నది. బ్యాట్స్మెన్ గా సఫలమవుతున్నా.. సారథి గా మాత్రం KL Rahul అనుకున్నంతగా రాణించడం లేదు.
దీంతో రాహుల్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి కొత్త నాయకుడి వేటలో Punjab super kings పడినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ తరఫున రాహుల్ చివరి మ్యాచ్ కూడా ఆడేశాడని మరికొన్ని రాశాయి.
అంతేగాక రాహుల్ కూడా తాను టీమ్ మారాలని కోరుకుంటున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఉండాలని రాహుల్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే 2022 కు గాను బీసీసీఐ ఇంకా రిటైన్ పాలసీని ప్రకటించలేదు. ఇది ప్రకటించిన తర్వాత రాహుల్, పంజాబ్ యాజమాన్యం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాను ఫ్రాంచైజీ మారడంపై రాహుల్ ఇప్పటికే పలు యాజమాన్యాలను సంప్రదించాడని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్ లో ఐపీఎల్ లో పది జట్లు రాబోతున్నాయి. కొత్త జట్లు కూడా రాహుల్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయట.
2018 మెగా ఆక్షన్ లోపంజాబ్ జట్టు రూ. 11 కోట్లతో రాహుల్ ను కొనుక్కుంది. తన నాలుగేళ్ల ప్రయాణంలో రాహుల్ బ్యాట్స్మెన్ గా అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ నాలుగేళ్లలో వరుసగా 659, 593, 650, 626 పరుగులు చేశాడు. 2020 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రాహుల్ దే. ఈ ఏడాది కూడా ఆ క్యాప్ రాహుల్ వద్దే ఉంది.
ఇక 2018 లో పంజాబ్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు స్వీకరించిన ఈ కర్నాటక కుర్రాడు.. ఆ జట్టును ముందుండి నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు.
2018 సీజన్ లో 7 వ స్థానంలో ఉన్న పంజాబ్.. 2019 లో ఆరో స్థానం.. 2020లో ఆరో స్థానం.. 2021 లోనే ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2014లో ఫైనల్స్ కు చేరడం.
KL Rahul
2018 సీజన్ లో 7 వ స్థానంలో ఉన్న పంజాబ్.. 2019 లో ఆరో స్థానం.. 2020లో ఆరో స్థానం.. 2021 లోనే ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2014లో ఫైనల్స్ కు చేరడం.
ఈ ఏడాది బ్యాటింగ్ లో కెఎల్ రాహుల్, మయాంక్ రాణించినా.. గేల్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఈ ఏడాది కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.