MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: అవును ఇది నా అడ్డా.. ఎలా ఆడాలో తెలుసు : కేఎల్ రాహుల్

KL Rahul: అవును ఇది నా అడ్డా.. ఎలా ఆడాలో తెలుసు : కేఎల్ రాహుల్

KL Rhaul: ఐపీఎల్ 2025లో బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ ఓడిపోయింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో ఢిల్లీ క్యాపిటల్స్ చేతితో ఆర్సీబీ ఓటమి నంచి తప్పించుకోలేకపోయింది. ఈ గ్రౌండ్ గురించి తనకు బాగా తెలుసుననీ, అందుకే ఈ రోజు ఇలాంటి నాక్ వచ్చిందని కేఎల్ రాహుల్ తెలిపాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 11 2025, 01:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

KL Rhaul: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఎదుర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 24వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతూ ఆర్సీబీని డీసీ 6 వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్బుతమైన నాక్ తో చివరివరకు క్రీజులో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు.

తన సొంత గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ కు ఎలా ఆడాలో తెలుసు. చాలా సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడాడు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకుని కీలకసమయంలో క్రీజులో నిలబడి విన్నింగ్ నాక్ ఆడాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీని గెలిపించాడు. ఆర్సీబీని హోం గ్రౌండ్ లో ఓడించాడు. 

34

మొత్తంగా ఆర్సీబీపై తన అధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఆర్సీబీ అంటే చాలు అద్భుత ఇన్నింగ్స్ లు ఆడే కేఎల్ రాహుల్.. 16 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 741 పరుగులు చేశాడు.

మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్‌లో కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత.. గ్రౌండ్ ను ఎలా ఉపయోగించుకున్నాడో, ఎలా ఈ సూపర్ నాక్ ఆడాడో  వివరించాడు. ఆ రోజు అది కొంచెం గమ్మత్తైన వికెట్ అనీ, డీసీ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టంప్స్ వెనుక ఉండటం వల్ల ట్రాక్ గురించి మరింత తెలుసుకోవడానికి తనకు సహాయపడిందని చెప్పాడు. అక్కడి నుంచే పరిస్థితులను అంచనా వేయడంతో మంచి ఫలితం లభించిందని చెప్పాడు.

44
Image Credit: Twitter/Delhi Capitals

Image Credit: Twitter/Delhi Capitals

టార్గెట్ ఛేదనలో బాల్ ను ఎక్కడ కొట్టి పరుగులు రాబట్టాలో తనకు తెలుసునని కేఎల్ రాహుల్ తెలిపాడు. అలాగే, తాను ఇచ్చిన క్యాచ్ ను రజత్ పాటిదార్  వదలడంతో మరో లైఫ్ పొందడం తన  తన అదృష్టమని కూడా చెప్పాడు. బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్.. చిన్నస్వామి స్టేడియం గురించి అందరికంటే తనకు బాగా తెలుసనీ, ఇక్కడ ఆడటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved