MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఐపీఎల్ ఓపెనింగ్‌లో సల్మాన్, షారుఖ్, దిశాపటానీ.. అదిరిపోద్ది మరి !

IPL 2025: ఐపీఎల్ ఓపెనింగ్‌లో సల్మాన్, షారుఖ్, దిశాపటానీ.. అదిరిపోద్ది మరి !

IPL 2025 Opening Ceremony: ఐపీఎల్ 2025 మొదలవ్వడానికి రెడీగా ఉంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, దిశా పటాని, శ్రద్ధా కపూర్, ఇంకా వన్ రిపబ్లిక్ లాంటి పెద్ద మ్యూజిక్ స్టార్లు వస్తున్నారు !

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 21 2025, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 Opening Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 దగ్గర పడుతుండటంతో క్రేజ్ ఎక్కువ అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయాక అందరి కళ్ళు ఐపీఎల్ మీదనే ఉన్నాయి. మార్చి 22 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ సెర్మనీ చూడటానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్  కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 PM IST కు ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెరిమనీ భారీ స్థాయిలో సాయంత్రం 6:00 PM IST జ‌ర‌గ‌నుంది.

25
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నుండి పెద్ద స్టార్లు తమ ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టేజ్ మీద దుమ్ములేపేలా డాన్స్ చేయనున్నారు. అలాగే, శ్రద్ధా కపూర్ కూడా దన ప్రదర్శనలతో అదరగొట్టనుంది. 

35
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

ఖాన్స్‌తో, కపూర్‌తో పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఇంకా దిశా పటాని కూడా వస్తారని సమాచారం. వాళ్ళందరూ వస్తే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని చెప్పవచ్చు.

 

 

 

45
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మ్యూజిక్ స్టార్లు కూడా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొననున్నారు. స్టార్ సింగర్లు శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్, ఇంకా కరణ్ ఔజ్లా లు తమ పాటలతో క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించడానికి  సిద్ధంగా ఉన్నారు.  అలాగే, అమెరికన్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా వాళ్ళ హిట్ సాంగ్స్ తో మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌ హోరెత్తనుంది.

55
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB

మార్చి 22న జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యం ఇస్తుంది. అయితే, తొలి మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టే అవకాశముంది.

మధ్యాహ్నం నుంచి వర్షం పడే అవకాశాలుున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయనీ, అలాగే, ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటిపూట వర్షం పడే అవకాశం 74% ఉండగా, సాయంత్రం 90% ఉంటుందని Accuweather నివేదికలు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. టీ20 వరల్డ్ కప్‌లో అసలేం జరుగుతోంది?
Recommended image2
PAK vs ENG : పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇంగ్లాండ్.. సెమీస్ బెర్త్ ఫిక్స్
Recommended image3
India vs Zimbabwe : తిలక్ అవుట్.. సంజూ ఇన్! సూపర్ 8లో భారత్ సెన్సేషనల్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved