- Home
- Sports
- Cricket
- IPL 2025: కోహ్లీ కాదు బుమ్రా కాదు.. ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
IPL 2025: కోహ్లీ కాదు బుమ్రా కాదు.. ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
Travis Head's favorite Indian player: ఆస్ట్రేలియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఐపీఎలో లో తనదైన దూకుడు ఆటతో దాదాపు అన్ని జట్లకు తలనొప్పి తెప్పించే ఇన్నింగ్స్ లను ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ట్రావిస్ హెడ్ కు ఇష్టమైన, అతనితో కలిసి ఆడాలకుంటున్న భారత ప్లేయర్ ఎవరో తెలుసా?

Travis Head's favorite Indian player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత భయంకరమైన జట్టుగా, ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మారిందంటే అందులో చెప్పుకునే ప్లేయర్లలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఉంటాడు.
అద్బుతమైన బ్యాటింగ్ తో ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ టీమ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్న ట్రావిస్ హెడ్.. తనకు ఇష్టమైన భారత ప్లేయర్ ఎవరో చెప్పాడు. అతనికి కలిసి ఆడాలనుకుంటున్నట్టు కూడా పేర్కొన్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జట్టులోనే కాదు.. ప్రపంచ క్రికెట్ లో అనేక రికార్డుల హోల్డర్ అయిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ రారాజుగా ఉన్నాడు. అలాగే, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని టాప్ బౌలిర్ గా కొనసాగుతున్నాడు. అలాంటి ఈ ఇద్దరు స్టార్లను కాదని భారత ప్లేయర్లలో ఎవరితోని ఆడాలనుకుంటున్నాడో ట్రావిస్ హెడ్ చెప్పాడు. భారత జట్టులోని ప్లేయర్లలో తనకు ఇష్టమైన ప్లేయర్ సిక్సర్ల కింగ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అని తెలిపాడు. అలాగే, రోహిత్ తో కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలనే తన కోరికను కూడా హెడ్ వ్యక్తం చేశాడు.
ట్రావిస్ హెడ్ తన ఓపెనింగ్ భాగస్వామిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన ఆస్ట్రేలియన్‌గా మార్చాలనుకునే ప్లేయర్ పేరును చెప్పమని అడగ్గా.. అతను నవ్వుతూ, 'రోహిత్, నేను అతనితో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను.. అది చాలా సరదాగా ఉంటుందని' చెప్పాడు.
అలాగే, తన క్రికెట్ రిటైర్మెంట్ అయ్యే సమయం వరకు ఏ రికార్డును సృష్టించాలనుకుంటున్నారని హెడ్ ను అడగ్గా.. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు లేదా వేగవంతమైన సెంచరీ కొట్టాలనుకుంటున్నానని చెప్పాడు. 'ఆరు సిక్సర్లు బాగుంటాయి, కానీ నేను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టలేనని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాలనుకుంటున్నాను' అని ట్రావిస్ హెడ్ చెప్పాడు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గత రెండేళ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారింది. ఈ జట్టు గత సీజన్‌లో విధ్వంసం సృష్టించింది. ఆ జట్టులోని ప్లేయర్లు సునామీ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లలను దంచికొట్టారు.
గత సీజన్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్‌తో అదరిపోయే ఇన్నింగ్స్ లను ఆడాడు. హైదరాబాద్ టీమ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కానీ ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్ద ఇన్నింగ్స్ లు రాలేదు. అలాగే, హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 10వ స్థానంలో ఉంది.