MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • LSG vs GT : ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ విధ్వంసం.. LSG హ్యాట్రిక్ గెలుపు

LSG vs GT : ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ విధ్వంసం.. LSG హ్యాట్రిక్ గెలుపు

LSG vs GT  IPL 2025 : ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టును లక్నో సూపర్ జెయింట్స్‌ 6 వికెట్ల తేడాతో ఓడించింది. నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ ఇద్దరూ సునామీ హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. ఈ గెలుపుతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 3వ స్థానంలోకి చేరింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 12 2025, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Lucknow Super Giants' Nicholas Pooran plays a shot

Lucknow Super Giants' Nicholas Pooran plays a shot

LSG vs GT  IPL 2025: రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మరో విక్టరీ అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో రాణించి శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ కు  6 వికెట్ల తేడాతో ఓడించింది. 

సీజన్ ప్రారంభంలో రెండు పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత పంత్ టీమ్ లక్నో తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌ను షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ లోని నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లు ఇద్దరు  తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడి తన టీమ్ కు విజయాన్ని అందించారు. సాయి సుదర్శన్ ఆడిన మరో హాఫ్ సెంచరీ వృధా అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఐపీఎల్ 2025లో  26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీందో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. అయితే, ఓపెనర్ల వికెట్లు పడిన తర్వాత ఆ జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. దీంతో 20 ఓవర్లలో 6  వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. 

 

34
Sai Sudarshan

Sai Sudarshan

గిల్, సాయి సుదర్శన్ సూపర్ నాక్ 

గుజరాత్ టీమ్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 60 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. సుదర్శన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేశాడు. 

లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. దిగ్వేష్ రతి, అవేష్ ఖాన్ లకు తలా ఒక వికెట్ లభించింది.

44
Image Credit: Twitter/LSG

Image Credit: Twitter/LSG

ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పురాన్ విధ్వంసం

181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో టీమ్ కు మంచి ఆరంభం లభించింది. రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు కానీ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, మరో ఎండ్‌లో ఐడెన్ మార్క్రామ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా మరోసారి పరుగులు సునామీ రేపాడు. 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 61 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. యంగ్ ప్లేయర్ ఆయూష్ బదోనీ చివరి వరకు క్రీజులో ఉండి 28 పరుగుల ఇన్నింగ్స్ తో 19.3 ఓవర్లలో 186 పరుగులతో లక్నోకు విజయాన్ని అందించాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved