MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 CSK vs KKR: ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వీరులు వీళ్లే.. టాప్ లో విరాట్ కోహ్లి

IPL2021 CSK vs KKR: ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వీరులు వీళ్లే.. టాప్ లో విరాట్ కోహ్లి

IPL Orange Cap: ఐపీఎల్ సీజన్ లో ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరిదో తేలిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ సారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. మరి ఐపీఎల్  తొలి సీజన్ నుంచి ఈ అవార్డును ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా..? 

3 Min read
Sreeharsha Gopagani
Published : Oct 15 2021, 09:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115


ధనాధన్ ఆటలో  మెరుగ్గా రాణించే జట్టే విజేతగా నిలుస్తుంది. అయితే బౌలింగ్ కంటే బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లే ప్రతి జట్టుకు కీలకం. ఈ క్రమంలోనే ప్రతి సీజన్ లో బాగా ఆడి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్ అవార్డు దక్కుతున్నది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రతి సీజన్ లో ఈ ఘనత సాధించిన వీరుడెవరో ఒకసారి చూద్దాం. 

215

షాన్ మార్ష్ (shaun Marsh): ఐపీఎల్ తొలి సీజన్ (2008)  లో ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఆ సీజన్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరఫున ఆడిన మార్ష్.. 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. 

315

మాథ్యూ హెడెన్ (Mathew hayden): 2009 సీజన్ లో కూడా ఆసీస్ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన హెడెన్.. ఆ సీజన్ లో 12 మ్యాచుల్లో 572 పరుగులు చేశాడు. 

415

సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar): 2010 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ను భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున  ఆడిన సచిన్.. 15 మ్యాచుల్లో 618 పరుగులు చేశాడు. 

515

క్రిస్ గేల్ (Chris gayle): 2011 సీజన్ లో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఈ క్యాప్ గెలుచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు తరఫున ఆడిన గేల్.. 12 మ్యాచుల్లో 608 పరుగులు చేశాడు. 

615

క్రిస్ గేల్ (Chris gayle): 2012 సీజన్ లో కూడా క్రిస్ గేలే ఈ అవార్డు సాధించాడు. 15 మ్యాచులాడిన గేల్.. 733 పరుగులు సాధించాడు. 

715

మైకెల్ హస్సీ (Michael hussy): 2013 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ ను ఆసీస్ ఆటగాడు మైకెల్ హస్సీ దక్కించుకున్నాడు. ఆ సీజన్ లో చెన్నై తరఫున ఆడిన హస్సీ.. 16 మ్యాచుల్లో 733 పరుగులు చేశాడు. 

815

రాబిన్ ఊతప్ప (Robin Uthappa): 2014 సీజన్ లో  కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కు ఈ క్యాప్ సొంతమైంది. ఆ సీజన్ లో అతడు 16 మ్యాచుల్లో 660 పరుగులు సాధించాడు. 

915

డేవిడ్ వార్నర్ (David Warner): 2015 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్ లో 14 మ్యాచ్ లాడిన వార్నర్ భాయ్.. 562 పరుగులు చేశాడు. 

1015

విరాట్ కోహ్లి (Virat Kohli): 2016 లో  ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (ఆర్సీబీ) ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఆ ఐపీఎల్ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన విరాట్.. ఏకంగా 973 రన్స్ కొట్టాడు. 

1115

డేవిడ్ వార్నర్  (David Warner): 2017 ఐపీఎల్ లో  హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. 14 మ్యాచుల్లో 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. 

1215

కేన్ విలియమ్సన్ (Kane williamson): 2018 సీజన్ లో న్యూజీలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) 17 మ్యాచుల్లో 735 పరుగులు చేసి ఈ ఘనత  సొంతం చేసుకున్నాడు. 

1315

డేవిడ్ వార్నర్  (David Warner): 2019 సీజన్ లో కూడా మళ్లీ వార్నర్ భాయే ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఆ ఐపీఎల్ లో 12 మ్యాచుల్లో 692 పరుగులు చేశాడు మన వార్నర్ భాయ్. 

1415
केएल राहुल

केएल राहुल

కెఎల్ రాహుల్ (KL Rahul): 2020 సీజన్ లో  పంజాబ్ సూపర్ కింగ్స్ కెప్టెన్  రాహుల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. గత సీజన్ లో రాహుల్.. 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు. 
 

1515

రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj gaikwad): ఇక ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో 16 వ మ్యాచ్ ఆడుతున్న గైక్వాడ్.. 635 పరుగులు సాధించాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved