- Home
- Sports
- Cricket
- IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022... వారం ముందే ప్రారంభం కానున్న మెగా క్రికెట్ లీగ్...
IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022... వారం ముందే ప్రారంభం కానున్న మెగా క్రికెట్ లీగ్...
IPL 2022: మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం... మే 29న ఫైనల్ మ్యాచ్... ముంబై, పూణేల్లో లీగ్ మ్యాచులు, అహ్మదాబాద్‌లో నాకౌట్ మ్యాచులు...

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ, ఈసారి వారం ముందుగానే ప్రారంభం కానుంది. మార్చి 26న ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది.
గురువారం ఫిబ్రవరి 24న సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సింగ్, మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఐపీఎల్ 2022 సీజన్‌కి మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి... ముంబైలో 55 మ్యాచులు, పూణేలో 15 మ్యాచులు జరుగుతాయి.
వాంఖడే స్టేడియంలో 20 మ్యాచులు జరగబోతుంటే, బ్రాబోన్ స్టేడియంలో 15, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచులు జరుగుతాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్‌లో 15 మ్యాచులు జరుగుతాయి...
ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులను ఖాళీ స్టేడియాల్లో కాకుండా ప్రేక్షకుల మధ్య నిర్వహించబోతున్నట్టు తెలిపాడు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేశ్ పటేల్.
‘ఐపీఎల్ 2022 సీజన్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించబోతున్నాం. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తాం...
లీగ్ మ్యాచులకు 25 నుంచి 50 శాతం కెపాసిటీలో ప్రేక్షకులకు అనుమతి దక్కొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేశ్ పటేల్.
మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్, ఆదివారం మే 29న ముగుస్తుంది. ప్లేఆఫ్స్ ఎక్కడ జరుగుతాయనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో 75 శాతం నుంచి 100 శాతం ప్రేక్షకుల మధ్య సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించబోతున్నారని సమాచారం...