- Home
- Sports
- Cricket
- IPL Auction 2021: యువరాజ్ సింగ్ రికార్డు కొట్టగల ప్లేయర్లు వీరే... సోషల్ మీడియాలో...
IPL Auction 2021: యువరాజ్ సింగ్ రికార్డు కొట్టగల ప్లేయర్లు వీరే... సోషల్ మీడియాలో...
ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. యువీ కోసం ఏకంగా రూ.16 కోట్ల రూపాయలు చెల్లించింది ఢిల్లీ జట్టు. గత ఆరు సీజన్లుగా యువరాజ్ రికార్డు అలాగే ఉంది. గత సీజన్‌లో యువరాజ్ సింగ్ రికార్డు దగ్గరగా వచ్చిన ప్యాట్ కమ్మిన్స్ రూ.15.50 కోట్ల దగ్గర ఆగిపోయాడు. అయితే ఈసారి యువీ రికార్డు బద్ధలుకావడం ఖాయంగా కనిపిస్తోంది...

ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ పర్సులో రూ.53.20 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో రూ.37.85 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ.35.4 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు జట్లు నచ్చిన ప్లేయర్ కోసం రూ.16-20 కోట్లు చెల్లించేందుకు కూడా వెనకాడకపోవచ్చు. ఈ వేలంలో యువరాజ్ సింగ్ రికార్డును కొట్టగల ప్లేయర్లు వీరేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

క్రిస్ మోరిస్: గత సీజన్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయిన మోరిస్, బౌలింగ్‌లో 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. మోరిస్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్, చెన్నై, ఢిల్లీ వంటి జట్లు పోటీపడే అవకాశం ఉంది.

జే రిచర్డ్‌సన్: బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు 24 ఏళ్ల ఆసీస్ ప్లేయర్ జే రిచర్డ్‌సన్. 12 వన్డేల్లో 24 వికెట్లు తీసిన రిచర్డ్‌సన్ కోసం ముంబై ఇండియన్స్ వంటి టాప్ టీమ్ కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది. ఈ డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలర్‌కి రికార్డు ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

కేల్ జెమ్మిసన్: న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ కేల్ జెమ్మిసన్, టీ20 ఫార్మాట్‌లో సెన్సేషనల్ సూపర్ స్టార్‌లా మారాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన ఆరు అడుగుల పొడవైన జెమ్మిసన్, ఐపీఎల్ వేలంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. 6 టెస్టుల్లో 36 వికెట్లు తీసిన జెమ్మిసన్ కోసం అన్ని జట్ల మధ్య మంచి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

డేవిడ్ మలాన్: టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో డేవిడ్ మలాన్ కోసం అన్ని జట్లూ పోటీ పడే అవకాశం ఉంది. స్టార్ బ్యాట్స్‌మెన్లు పుష్కలంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ కూడా మలాన్ కోసం పోటీలో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.