IPL 2025: ఢిల్లీకి షాక్.. హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో జట్టులోకి వచ్చేది ఎవరు?
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2025 నుంచి ఔట్ అయ్యాడు.

IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హ్యారీ బ్రూక్ రాబోయే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్చి 22న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభం కానుంది. ఢిల్లీ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్ బ్యాటర్‌ను ఐపీఎల్ 2025 వేలంలో రూ. 6.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది తన అమ్మమ్మ మరణించడంతో కుటుంబంతో ఉండటానికి ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
హ్యారీ బ్రూక్ చాలా బిజీ షెడ్యూల్ తర్వాత కోలుకోవడానికి, అతని జాతీయ టీమ్ మ్యాచ్ లపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం కావాలి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘోరంగా అవుట్ అయిన ఇంగ్లాండ్ జట్టులో 26 ఏళ్ల బ్రూక్ ఉన్నాడు. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలనొప్పిగా మారింది. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఆలోచనలు చేస్తోంది. అయితే రాబోయే సీజన్‌లో హ్యారీ బ్రూక్‌కు బదులుగా ఢిల్లీ జట్టులోకి తీసుకోవాలని చూస్తున్న ప్లేయర్లు ఓవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోలేదు. వేలానికి ముందు అతడిని వదులుకునే వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడు సీజన్ల పాటు ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.
గత ఏడాది వార్నర్ ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌ల్లో 21 సగటుతో 162 పరుగులు మాత్రమే చేశాడు. డేవిడ్ వార్నర్ అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాటర్లలో ఒకడు. అతడు 6565 పరుగులు చేశాడు. అందులో 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత 2022 నుంచి 2024 వరకు ఆరు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2572 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా బ్యాటర్‌ను హ్యారీ బ్రూక్‌కు బదులుగా తీసుకోవచ్చు. వార్నర్ దూకుడుగా ఆడగలడు.
2. డెవాల్డ్ బ్రెవిస్
ఢిల్లీ క్యాపిటల్స్‌లో హ్యారీ బ్రూక్‌కు బదులుగా డెవాల్డ్ బ్రెవిస్ కూడా మంచి ఎంపిక. కనీస ధర రూ. 75 లక్షలు ఉన్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. బ్రెవిస్ 2022, 2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. వేలంలో ఫ్రాంచైజీ అతడిని వదులుకుంది. 10 మ్యాచ్‌ల్లో 21 ఏళ్ల బ్రెవిస్ 23 సగటుతో 230 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 133.72గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ దాటిగా ఆడగలడు. 2022 అండర్-19 ప్రపంచ కప్, ఐపీఎల్ 2022లో ఇది స్పష్టంగా కనిపించింది. బ్రెవిస్ ఓపెనర్‌గా వచ్చి మెరుపులు మెరిపించగలడు. లేదా మిడిలార్డర్‌లో అయినా రాణించగలడు. హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడతాడు కాబట్టి.. అలాంటి ఆటగాడే కావాలనుకుంటే బ్రెవిస్ సరైన ఎంపిక కావచ్చు.
3. బ్రాండన్ మెక్‌ముల్లెన్
స్కాటిష్ బ్యాటర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో హ్యారీ బ్రూక్‌కు బదులుగా ఆడే అవకాశం ఉంది. మెక్‌ముల్లెన్ ఐపీఎల్ 2025 వేలంలో తన పేరును రూ. 30 లక్షల కనీస ధరతో నమోదు చేసుకున్నాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. 26 ఏళ్ల మెక్‌ముల్లెన్ దూకుడుగా ఆడగలడు. తన దాటిగా ఆడే శైలితో ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. మెక్‌ముల్లెన్‌కు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది.
20 మ్యాచ్‌ల్లో 35.64 సగటుతో 606 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్కాట్లాండ్ తరఫున టీ20 ప్రపంచ కప్ 2024లో మెక్‌ముల్లెన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే ఆటగాడి కోసం చూస్తుంటే బ్రాండన్ మెక్‌ముల్లెన్‌ను తీసుకోవచ్చు.
4. డారిల్ మిచెల్
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మాజీ బ్యాటర్ డారిల్ మిచెల్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోలేదు. మిచెల్ సీఎస్‌కే తరఫున ఒక సీజన్ మాత్రమే ఆడాడు. వేలానికి ముందు అతడిని జట్టు నుంచి వదులుకున్నారు. రూ. 2 కోట్ల కనీస ధరతో 34 ఏళ్ల న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని హ్యారీ బ్రూక్‌కు బదులుగా తీసుకుంటే మిచెల్‌కు ఐపీఎల్ ఆడే అవకాశం వస్తుంది. మిచెల్ కుడిచేతి వాటం బ్యాటర్. అతడు స్పిన్ ఆడగలడు. భారత పరిస్థితుల్లో ఆడే బ్యాటర్‌కు ఇది చాలా ముఖ్యం. డారిల్ మిచెల్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యారీ బ్రూక్‌కు సరైన ఎంపిక అవుతాడు.
5. రాస్సీ వాన్ డెర్ డస్సెన్
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్‌కు బదులుగా తీసుకోవచ్చు. అతడికి 36 ఏళ్లు ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ లో మంచి అనుభవం ఉంది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన వాన్ డెర్ డస్సెన్ ఐపీఎల్ 2025 వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అమ్ముడుపోలేదు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌కు టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది.
222 మ్యాచ్‌ల్లో 37.82 సగటుతో 6468 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వాన్ డెర్ డస్సెన్ ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని తీసుకోలేదు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ హ్యారీ బ్రూక్ లాగే దూకుడుగా ఆడగలడు. మిడిలార్డర్‌లో నిలకడగా రాణించగలడు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్‌ను బ్రూక్‌కు బదులుగా తీసుకోవచ్చు.

