MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: క్రికెట్ లవర్స్ కు షాక్.. KKR vs RCB ఐపీఎల్ తొలి మ్యాచ్ రద్దు కానుందా?

IPL 2025: క్రికెట్ లవర్స్ కు షాక్.. KKR vs RCB ఐపీఎల్ తొలి మ్యాచ్ రద్దు కానుందా?

IPL 2025 KKR vs RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)  - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే తొలి మ్యాచ్ రద్దు కానుందా? పూర్తి వివరాలు మీకోసం. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 21 2025, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఎడిష‌న్ మార్చి 22న ఘ‌నంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్  కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 PM IST కు ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెరిమనీ సాయంత్రం 6:00 PM IST జ‌ర‌గ‌నుంది. అయితే, తొలి మ్యాచ్ ను ర‌ద్దు అయ్యే అవ‌కాశముంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ కు పొంచివున్న వర్షం ముప్పు !

ఐపీఎల్ 2025లో జరిగే తొలి మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టే అవకాశముంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. 

35

అలాగే, మ్యాచ్ కు ముందు బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరిమనీ జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, దిశా పటానీల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అయితే, ప్రారంభ వేడుకలకు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది.

45

మార్చి 22న కోల్‌కతాపై ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయనీ, అలాగే, ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటిపూట వర్షం పడే అవకాశం 74% ఉండగా, సాయంత్రం 90% ఉంటుందని Accuweather నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో వర్షం పడితే ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలకు అంతరాయం కలగవచ్చు. అలాగే, తొలి మ్యాచ్ వర్షంలో మునిగిపోవచ్చు. ఒడిశా నుండి విదర్భ వరకు ద్రోణి, తూర్పు భారతదేశం మీదుగా గాలులు కలవడం వల్లే వాతావరణం అస్థిరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

55

ఏప్రిల్ 6న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్‌ను గౌహతికి మార్చనున్నారు. ఇప్పుడు తొలి మ్యాచ్ ను వ‌ర్షం బెదిరిస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్ లో రెండు ఐపీఎల్ 2025 మ్యాచ్‌పై ప్రభావం పడింది.  

శ్రీరామ నవమి సందర్భంగా భద్రతా కారణాలతో మ్యాచ్‌ను కోల్‌కతాలో నిర్వహించడం స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంద‌ని కోల్‌కతా పోలీసులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి  తెలిపారు. ఈ విష‌యాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ స్పష్టం చేశారు.  

పశ్చిమ బెంగాల్‌లో 20,000కి పైగా ఊరేగింపులు నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికల కారణంగా, భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావించారు. ఈ క్ర‌మంలోనే కోల్ క‌తా నుంచి మ్యాచ్ ను గౌహ‌తికి మార్చ‌నున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved