IPL 2025: జస్ప్రీత్ బుమ్రా-హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్ కు షాక్
IPL 2025 mumbai indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభ మ్యాచ్‌ల నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్ అయ్యారు. ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది.

IPL 2025 mumbai indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇప్పుడు ఐపీఎల్ జాతర మొదలకానుంది. మార్చి 22 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మెగా క్రికెట్ లీగ్ ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ సిద్ధంగా ఉంది.

Image Credit: Getty Images
ముంబై ఇండియన్స్ కు షాక్
ఐపీఎల్ 2025 ప్రారంభం కాకముందే రోహిత్ శర్మ టీమ్ ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఆ టీమ్ తొలి మ్యాచ్ కు దూరమయ్యారు. వీరితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లో లేదా ఐపీఎల్ తొలి అర్ధభాగంలో ఆడే అవకాశాలు లేవని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Mayank Yadav (Photo: BCCI)
మయాంక్ యాదవ్ కు ఏమైంది?
ఎల్ఎస్జీ యంగ్ స్టార్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇంకా అతను పూర్తిగా కోలుకోలేదు. అయితే, మయాంక్ ఇటీవలే బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2024 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత మయాంక్ గాయపడ్డాడు. అతను తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టే విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్ రెండవ భాగంలో ఆడవచ్చని సమాచారం.
ఐపీఎల్ మొదటి అర్ధభాగంలో మయాంక్ అందుబాటులో లేకపోవడం లక్నో టీమ్ కు పెద్ద ఎదురుదెబ్బ. మెగా వేలానికి ముందు అతన్ని రూ. 11 కోట్లకు దక్కించుకుంది. 2024 సీజన్‌కు ముందు అతన్ని అన్‌క్యాప్డ్ బౌలర్‌గా రూ. 20 లక్షల దక్కించుకున్నాడు. అయితే, తన అద్భుతమైన బౌలింగ్ తో ఏకంగా కోట్ల రూపాయల కాంట్రాక్టును పొందాడు. IPL 2024లో 150 kmph వేగంతో బౌలింగ్ చేసి రికార్డుల మోత మోగించాడు. తన మొదటి రెండు మ్యాచ్‌లలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
బుమ్రా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు ఎందుకు దూరమయ్యాడు?
ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న బుమ్రా, బౌలింగ్‌ను తిరిగి ప్రారంభించాడు కానీ ఇంకా పూర్తిగా సిద్ధంగా లేడు. ప్రస్తుత సమాచారం ప్రకారం బుమ్రా ఏప్రిల్ ప్రారంభంలో జట్టులో చేరడానికి ఫిట్‌గా ఉండవచ్చు. అంటే ఐపీఎల్ 2025 మొదటి రెండు వారాలు జట్టుకు దూరం కానున్నాడు.
rohit sharma and hardik pandya
ముంబై మొదటి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం !
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ దూరం కానున్నాడని సమాచారం. రాబోయే సీజన్‌లోనూ ముంబై జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనున్న హార్దిక్ పై ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌ను నిషేధం కారణంగా ఆడలేడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగవచ్చు.
ఐపీఎల్ 2024లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా బుమ్రా ఉండగా, గత సీజన్ లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను నమోదుచేశాడు. ఒక కెప్టెన్ మొదటిసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే రూ. 12 లక్షల జరిమానా, రెండో సారి అయితే రూ. 24 లక్షల జరిమానా ఉంటుంది. అయితే, మూడో సారి కూడా స్లో ఓవర్ రేటు జరిగితే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఇతర ఆటగాళ్లకు కూడా జరిమానా విధిస్తారు. అలాగే, ఒక మ్యాచ్ నిషేధం కూడా ఉంటుంది. కాబట్టి గత సీజన్ లో మూడు సార్లు స్లో ఓవర్ రేటును నమోదుచేసిన హార్దిక్ పై రాబోయే ఐసీఎల్ సీజన్ లో ఒక మ్యాచ్ నిషేధం ఉండనుంది.

