Rohit Sharma : ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డ్...
IPL 2025-Rohit Sharma: ఐపీఎల్ లో ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో ప్లేయర్ గా ఉన్నాడు. రాబోయే సీజన్ లో ముంబై రోహిత్ ను రిటైన్ చేసుకోకపోతే అతన్ని దక్కించుకోవడానికి చాలా టీమ్ లు తమ పర్సులో భారీగా మనీ రిజర్వు చేసుకుంటున్నాయి.
IPL 2025-Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2025) సీజన్ కోసం మెగా వేలం ఈ డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో మెగా వేలంలో తమ జట్లలోకి తీసుకునే ప్లేయర్ల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
rohit sharma
అయితే, ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్, ముంబై టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తాడనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు.
ఐదు సార్లు ముంబై టీమ్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు రోహిత్ శర్మ. మేనేజ్‌మెంట్-ఆటగాడికి మధ్య ఉన్న ఉద్రిక్తతను పరిగణనలోకి తీసుకొని రోహిత్ శర్మ రాబోయే సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్‌ను విడిచిపెడుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు రిటైన్ చేసుకోకపోతే అతన్ని దక్కించుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఉన్నాయి. వాటిలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ഹിറ്റ്മാനും ടീമില്
ఐపీఎల్ చరిత్రలో 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి అతని కెప్టెన్సీ లక్షణాలు, బ్యాటింగ్ సామర్థ్యాలు అతన్ని భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్ గా నిలబెట్టాయి. అయితే లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పటికే ఉన్న రికార్డును బద్దలు కొట్టాలంటే మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రూ. 24.75 కోట్ల రికార్డును అధిగమించాలి. దాదాపు రూ.25 కోట్లు రాబట్టాలి. అయితే, చాలా జట్లు రోహిత్ కోసం అంతకు మించి పర్సును రిజర్వు చేసుకున్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కొన్ని జట్లు దాదాపు రూ.50 కోట్లు రిజర్వు చేసుకున్నాయి మీడియా కథనాలు చెబుతున్నాయి.
కాబట్టి ఒకవేళ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా రికార్డు సృష్టించడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో రోహిత్ శర్మకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2025 లో భారత జట్టును ఛాంపియన్ గా నిలబెట్టడంతో పాటు అతని ఐపీఎల్ రికార్డులు రోహిత్ శర్మకు భారీ డిమాండ్ ను సంపాదించిపెట్టాయి.