IPL 2025 : బుమ్రా నుంచి హార్దిక్ వరకు - ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే
IPL 2025 - Mumbai Indians Retention List: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్ని ప్రాంఛైజీలు ఏఏ ప్లేయర్లను జట్టుతో ఉంచుకోవాలనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ బుమ్రా నుంచి హార్దిక్ పాండ్యా వరకు జట్టులో ఉంచుకునే ప్లేయర్ల వివరాలు మీకోసం.
IPL 2025 - Mumbai Indians Retention List
IPL 2025 - Mumbai Indians Retention List: అక్టోబర్ ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వేలానికి ముందు ఆటగాళ్ల నిలుపుదల (రిటెన్షన్) కోసం అధికారిక మార్గదర్శకాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) విడుదల చేసింది. మొత్తం పది జట్లను అక్టోబర్ 31 లోపు తమ తుది రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే అన్ని ప్రాంఛైజీలు తమ జట్టులో ఉంచుకునే ప్లేయర్ల లిస్టుపై కసరత్తులు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ గురించి క్రికెట్ సర్కిల్ లో ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్, జట్టు మొత్తంగా స్టార్ ప్లేయర్లతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది ముంబై ఇండియన్స్. భారత జట్టులోని సగం మంది స్టార్ ప్లేయర్లు ఈ జట్టులోనే ఉన్నారు. దీంతో ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్టు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2025 - Mumbai Indians Retention List
రిటెన్షన్ వ్యూహాలు మార్చిన ముంబై ఇండియన్స్
ఆటగాళ్ల కోసం గత ఐపీఎల్ వేలంలో భారీగా ఖర్చు చేసినప్పటికీ ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ అనుకున్న స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్టులో భారీ మార్పులు చేయడానికి సిద్దమవుతోంది.
ఇతర జట్లు ఎవరిని రిటైన్ చేయాలనే దానిపై దృష్టి సారించినట్లుగా కాకుండా, ముంబై ఎవరిని విడుదల చేయాలనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే ఆ జట్టులో ఉన్న ప్లేయర్లు, జట్టుకు అవసరమైన రిటెన్షన్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తోంది. అయితే, ముంబై ఇండియన్స్ జట్టు అంటుపెట్టుకునే ప్లేయర్ల వివరాలు గమనిస్తే క్రికెట్ సర్కిల్ లో కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 - Mumbai Indians Retention List
జస్ప్రీత్ బుమ్రా
క్రికెట్ వరల్డ్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు జస్ప్రీత్ బుమ్రా. భారత స్టార్ పేసర్ బుమ్రా ముంబై ఇండియన్స్ అధికారిక రిటెన్షన్ జాబితాలో ఖచ్చితంగా ఉంటాడు. బుమ్రా 2015లో అరంగేట్రం చేసిన తర్వాత ముంబై టీమ్ విజయంలో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్ళలో ఒకరిగా ముందుకు సాగుతున్నారు. బుమ్రా బౌలింగ్ నైపుణ్యం, అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 18 కోట్ల రిటెన్షన్ తో నంబర్ వన్ స్థానంలో ఉంచే ఛాన్స్ కూడా లేకపోలేదు.
రోహిత్ శర్మ
జట్టు మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కు మాత్రమే కాదు ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించే రోహిత్ శర్మ ముంబై జట్టులో తప్పకుండా ఉంటాడు. ఇటీవల అతని బ్యాటింగ్ లో కొంత అస్థిరత ఉన్నప్పటికీ అతని నాయకత్వ లక్షణాలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టుతోనే ఉంచుకుంటుంది.
Rohit Sharma, Hardik pandya IPL 2025 - Mumbai Indians Retention List
ఇషాన్ కిషన్
ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే ఇసాన్ కిషన్ ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్. ఇప్పటికే జట్టులో తన ప్రాధాన్యతన నిరూపించుకున్నాడు. ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడటం, వేగంగా పరుగులు రాబట్టే అతని సామర్థ్యం అతన్ని నిలుపుదల వ్యూహంలో కీలక ఆటగాడిగా చేస్తాయి.
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్. గుజరాత్ కెప్టెన్ గా జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన తర్వాత ముంబై టీమ్ అతన్ని గత సీజన్ లో రోహిత్ స్థానంలో కెప్టెన్సీలోకి తీసుకుంది. ఒక విలువైన ఆల్‌రౌండర్, హార్దిక్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రాణించగల ప్లేయర్. కాబట్టి గత సీజన్ లో భారీ ధరకు అతన్ని జట్టులోకి తీసుకుంది. పాండ్యా కూడా ముంబై రిటెన్షన్ లిస్టులో తప్పకుండా ఉంటాడు.
Suryakumar Yadav IPL 2025 - Mumbai Indians Retention List
సూర్యకుమార్ యాదవ్
టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్. భారత టీ20 జట్టుకు కెప్టెన్. అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతన్ని తప్పకుండా ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్టులో ఉంటాడు. మిడిల్ ఆర్డర్‌లో కీలక ప్లేయర్. మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ కాబట్టి ముంబై సూర్యాను వదులుకునే అవకాశం లేదు.
తిలక్ వర్మ
తిలక్ వర్మ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న యంగ్ ప్లేయర్లలో ఒకరు. మిడిల్ ఆర్డర్‌లో నిలకడైన ప్రదర్శనలు అతడిని ముంబై టీమ్ నిలబెట్టుకునేలా చేశాయి. అతను ముంబై ఇండియన్స్ భవిష్యత్తులో కీలక భాగం అయ్యే అవకాశం ఉంది.