IPL 2024: కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్.. అధికారికంగా ప్రకటించిన గుజరాత్ టైటాన్స్
Shubman Gill: 17 మ్యాచ్ ల్లో 59.33 సగటుతో 890 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ గత ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ సాధించిన 973 పరుగుల తర్వాత అత్యధిక స్కోరర్ గా గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.
Gill appointed Gujarat Titans captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ సందడి షురూ అయింది. హార్దిక్ పాండ్యా ను ముంబై ఇండియన్స్ వెళ్తున్నట్టు ఫ్రాంచైజీ ధృవీకరించిన తర్వాత శుభ్‌మన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా నియమించింది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ లో శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. రెండు సీజన్ల పాటు గుజరాత్ కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా నుంచి గిల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
అంతకుముందు, ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన 2022 మొదటి సీజన్ లోనే హార్ధిక్ పాండ్యా గుజరాత్ కు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. అలాగే, 2023 లో రన్నరప్ ఫినిషింగ్ వరకు నడిపించాడు. గుజరాత్ పాండ్యాను వదులుకోవడంతో అతను ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లాడు.
Image credit: PTI
ముంబై ఇండియన్స్ జట్టులోకి హార్ధిక్ పాండ్యా వెళ్లడంతో అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఇక నుంచి గుజరాత్ జట్టు గిల్ నడిపిస్తాడని అధికారికంగా ప్రకటించింది.
"శుభ్‌మన్ గిల్ గత రెండేళ్లుగా ఆటలో అత్యున్నత స్థాయిలో నిలదొక్కుకోవడం చూస్తున్నాం. బ్యాటర్‌గా మాత్రమే కాకుండా క్రికెట్‌లో నాయకుడిగా కూడా పరిణతి సాధించడాన్ని మేము చూశాము. మైదానంలో అతని సహకారం గుజరాత్‌కు సహాయపడింది. టైటాన్స్ బలీయమైన శక్తిగా ఉద్భవించింది, 2022లో విజయవంతమైన ప్రయాణం.. 2023లో బలమైన రన్ ద్వారా జట్టును మార్గనిర్దేశం చేస్తుంది. అతని పరిణితి, నైపుణ్యం అతని మైదానంలోని ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తాయి. యువ నాయకుడితో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు మేము చాలా సంతోషిస్తున్నామని" గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి అన్నారు.
"గుజరాత్ టైటాన్స్ తొలి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రెండు అద్భుతమైన సీజన్లను అందించడంలో ఫ్రాంఛైజీకి సహాయపడ్డాడు, దీని ఫలితంగా ఒక ఐపీఎల్ ఛాంపియన్ షిప్, మరో సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లాం. ఇప్పుడు తన అసలు జట్టు ముంబై ఇండియన్స్ లోకి తిరిగి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆయన నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నాం, ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు" అని కూడా సోలంకి తెలిపారు.
కాగా, 17 మ్యాచ్ ల్లో 59.33 సగటుతో 890 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ గత ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ సాధించిన 973 పరుగుల తర్వాత అత్యధిక స్కోరర్ గా గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.