Jasprit Bumrah: ముంబైని అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఈ ఆగ్రహానికి హార్దిక్ పాండ్యా కారణమా..?
IPL 2024: ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ముగించుకుని ముంబై ఇండియన్స్ లోకి చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా తన మొదటి జట్టు ముంబైలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్న క్రమంలో జస్ప్రీత్ బుమ్రా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.
Bumrah Insta
Bumrah unfollows Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం జరగబోయే ఆటగాళ్ల వేలానికి ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు జట్లు కీలక ఆటగాళ్లను వదులుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి హార్దిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ జట్టులోకి వెళ్లడం పై చర్చ సాగుతూనే ఉంది.
ఇదే క్రమంలో ముంబయి ఇండియన్స్ జట్టు ప్లేయర్, బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అనేక ఊహాగనాలకు తెరలేపింది. జట్టు మారబోతున్నాడా? అనే సరికొత్త చర్చకూడా సాగుతోంది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్ లో బుమ్రా చేసిన పోస్టులతో పాటు ముంబయి ఇండియన్స్ జట్టు ను అన్ ఫాలో కావడమే.
బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో “కొన్నిసార్లు అత్యాశతో ఉండటం మంచిదే.. విధేయత చూపడం కాదు”, మౌనమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానం” అంటూ పేర్కొన్నాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్ (GT)తో తన రెండేళ్ల సుదీర్ఘ పని తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి ముంబయి ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు.
ఐపీఎల్ 2022లో జరిగిన మెగా వేలానికి ముందు పాండ్యాను ముంబయి వదులుకోవడంతో ఫ్రాంచైజీని వదిలి గుజరాత్ GTలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. గుజరాత్ కు మొదటి ఐపీఎల్ సీజన్ లోనే టైటిల్ ను అందించారు. 2023 సీజన్‌లో ఫైనల్ వరకు నడిపించాడు. అయితే, అనూహ్యంగా గుజరాత్ ఇప్పుడు పాండ్యాను వదులుకుంది.
పాండ్యా మళ్లీ ముంబయి జట్టుకు వచ్చిన క్రమంలో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఇదే క్రమంలో బుమ్రా కూడా పైన చప్పిన విధంగా పోస్టులు పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్ ముంబయి అన్ ఫాలో చేయడంతో రచ్చ మొదలైంది.
హార్దిక్ పాండ్యా ముంబయి జట్టులోకి రావడంతో జస్ప్రీత్ బుమ్రా సంతోషంగా లేడని కొందరు అభిమానులు భావిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టు మారవచ్చుననే ఊహాగనాలకు తెరలేపారు. రాయల్ ఛాలెంజర్ బెంగళూరుకు వెళ్లవచ్చనే టాక్ వినిపిస్తోంది.