- Home
- Sports
- Cricket
- ఫైనల్ గెలవాలంటే కెఎల్ రాహుల్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని ఆడించండి... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్...
ఫైనల్ గెలవాలంటే కెఎల్ రాహుల్ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని ఆడించండి... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొడుతూ రాణిస్తూ, టీమిండియా నెక్ట్స్ సూపర్ స్టార్‌గా అంచనాలను పెంచేస్తున్నాడు యశస్వి జైస్వాల్. 2020 అండర్ 19 వరల్డ్ కప్ హీరో, 12 మ్యాచుల్లో 575 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు..

Image credit: PTI
11 మ్యాచుల్లో 576 పరుగులు చేసిన ఆర్‌సీబీ కెప్టెన్, టాప్‌లో ఉంటే, యశస్వి జైస్వాల్ అతని కంటే 1 పరుగు మాత్రమే వెనకబడి ఉన్నాడు. ఫాఫ్ డుప్లిసిస్ మిగిలిన 3 మ్యాచుల్లో విఫలమైనా, లేక ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరకుండా, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆడితే జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...
Image credit: PTI
టాప్‌లో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్ ఇప్పటిదాకా సీజన్‌లో 45 ఫోర్లు, 32 సిక్సర్లు బాదితే 21 ఏళ్ల యశస్వి జైస్వాల్... 75 ఫోర్లు, 26 సిక్సర్లతో బౌండరీల విషయంలో టాప్‌లో నిలిచాడు..
PTI Photo/Shailendra Bhojak)(PTI04_23_2023_000275B)
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యాడు..
Image credit: BCCI
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 80.21 యావరేజ్‌తో పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, లిస్టు ఏ క్రికెట్‌లో 53.96 సగటుతో అదరగొట్టాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది..
‘నేనైతే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కెఎల్ రాహుల్ రిప్లేస్‌మెంట్‌గా యశస్వి జైస్వాల్‌ని సెలక్ట్ చేసేవాడిని. అతను అంత బాగా ఆడుతున్నాడు. అతను సూపర్ స్టార్ అవుతాడు... ’ అంటూ ట్వీట్ చేశాడు మైకెల్ వాగన్...
గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో దూరమైన కెఎల్ రాహుల్ ప్లేస్‌లో ఇషాన్ కిషన్‌ని టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సెలక్ట్ చేసింది బీసీసీఐ. అయితే నిలకడలేమికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఇషాన్ కిషన్.. తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే...
ఫైనల్ గెలవాలంటే సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ని ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సెలక్ట్ చేయడమే ఉత్తమం అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు..