MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని..? అదే నిజమైతే పూనకాలు లోడింగే..!

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని..? అదే నిజమైతే పూనకాలు లోడింగే..!

IPL 2023: ఐపీఎల్ లో నేటి సాయంత్రం   గుజరాత్ టైటాన్స్ తో తలపడనున్న  చెన్నై  సూపర్ కింగ్స్ భారీ   స్కెచ్ వేసింది. తుది జట్టు కూర్పులో భాగంగా  ఏకంగా ధోనితోనే...

2 Min read
Author : Srinivas M
Published : Mar 31 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొత్త సీజన్ లో  కొంగొత్త ఆశలతో  ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ  సీజన్ లో కొన్ని  కొత్త నిబంధనలు కూడా రానున్నాయి.  అందులో ముఖ్యమైంది ‘ఇంపాక్ట్ ప్లేయర్’.  దీని గురించి గత కొంతకాలంగా  క్రికెట్ వర్గాలలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.   

27

ఇంపాక్ట్ ప్లేయర్ అంటే  మ్యాచ్ జరుగుతుండగా ఇన్నింగ్స్   14వ ఓవర్ ముగిసిన తర్వాత  ఒక ఆటగాడి  స్థానంలో  తుది జట్టులో లేని ప్లేయర్ ను కూడా  తీసుకోవచ్చు. ఈ రూల్ ను   ఫ్రాంచైజీలు ఎలా వాడతాయో గానీ  మ్యాచ్ లను  సదరు ఇంపాక్ట్ ప్లేయర్  ఆటను ఎలా ప్రభావితం చేస్తాడోనని  ఐపీఎల్ టీమ్స్ తో పాటు అభిమానులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

37

టోర్నీలో  శుక్రవారం  చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్ లో  సీఎస్కే సారథి ధోని ఆడతాడా..? లేదా..? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.   రెండ్రోజుల క్రితం  నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా  ధోని ఎడమ మోకాలికి గాయమైందని, అతడు గుజరాత్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నా చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాత్రం వీటిని ఖండించాడు.  

47

అయితే  మ్యాచ్  ఆడేందుకు ధోని పూర్తి ఫిట్ గా లేకుంటే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా అయినా వాడుకోవాలని   చెన్నై భావిస్తున్నది.  ఇలా చేస్తే     సగం ఇన్నింగ్స్ ముగిశాక  ధోని క్రీజులోకి వచ్చి మెరుపులు మెరిపించి  తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. టీమ్ లో ఎలాగూ డెవాన్ కాన్వే రూపంలో వికెట్ కీపర్ కూడా ఉన్నాడు.   

57

ఈ రూల్ ను వాడితే    జట్టు కూర్పు కూడా సీఎస్కేకు కలిసొస్తుంది.  ఓపెనర్లుగా  డెవాన్ కాన్వే, రుతురాజ్ ఆడనుండగా  వన్ డౌన్ లో బెన్ స్టోక్స్ ను ఆడించాలని సీఎస్కే భావిస్తున్నది.   ఇదే  స్టోక్స్ కు బెస్ట్ ప్లేస్.  వాస్తవానికి ఈ ప్లేస్ లో మోయిన్ అలీ వచ్చేవాడు.  

67

కానీ ఇప్పుడు అలీని  నాలుగో స్థానానికి పంపి ఆ తర్వాత శివమ్  ధూబే   రవీంద్ర జడేజాలను  పంపించొచ్చు.  ఇలా చేస్తే కూడా ఓ సమస్య  ఉంది.   అలీ తర్వాత క్రీజులోకి వచ్చే అంబటి రాయుడును ఎక్కడ ఆడించాలన్నది   కీలకం..?  మరి చెన్నై తుది జట్టు ఎలా ఉండనుందోనని  ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

77

గుజరాత్  ఓపెనర్ల విషయానికొస్తే..  ప్రస్తుతం  అన్ని ఫార్మాట్లలో  అత్యద్భుత ఫామ్ తో దూసుకుపోతున్న  శుభ్‌మన్ గిల్.. కివీస్  స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ తో కలిసి  ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్నాడు.  గత సీజన్ లో పలు మ్యాచ్ లకు  వృద్ధిమాన్ సాహా, మరికొన్నింటికి  మాథ్యూ వేడ్ తో కలిసి  గిల్ ఓపెనర్ గా వచ్చాడు. 

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఆఖరి ఛాన్స్? జింబాబ్వే మ్యాచ్‌లో గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదే
Recommended image2
IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్‌కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
Recommended image3
Rinku Singh Net Worth : సిలిండర్లు మోసిన కుర్రాడు నేడు స్టార్ క్రికెటర్.. రింకూ ఆస్తి ఎంతుంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved