- Home
- Sports
- Cricket
- ఏందిది శంకరన్నా! మా టీమ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఆడావా? విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌పై వైరల్ మీమ్స్...
ఏందిది శంకరన్నా! మా టీమ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఆడావా? విజయ్ శంకర్ ఇన్నింగ్స్‌పై వైరల్ మీమ్స్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడి, అభిమానులకు దగ్గరైన ప్లేయర్లలో విజయ్ శంకర్ ఒకడు. లక్కీగా టీమిండియాలోకి వచ్చి, అంతే స్పీడ్‌గా వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో కూడా చోటు దక్కించుకున్నాడు విజయ్ శంకర్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్‌లో, భారత క్రికెట్‌లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ప్లేయర్ విజయ్ శంకర్...

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసి రికార్డు క్రియేట్ చేశాడు విజయ్ శంకర్. అయితే నెట్ సెషన్స్‌లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ ఆడుతూ గాయపడిన విజయ్ శంకర్, వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. అదే ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చాడు విజయ్ శంకర్...
విజయ్ శంకర్‌ని రూ.3 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 29 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్ మొత్తంగా చేసింది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ. డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ కారణంగా ఈజీగా గెలుస్తామనుకున్న మ్యాచులను కూడా విజయ్ శంకర్, మనీశ్ పాండే కలిసి ఓడించేవాళ్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్నప్పుడు విజయ్ శంకర్, సరిగ్గా ఆడి గెలిపించిన మ్యాచుల కంటే గెలుస్తాం అనుకున్న మ్యాచులను ఓడించిందే ఎక్కువ.. అలాంటి విజయ్ శంకర్, కేకేఆర్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు...
మొదటి 10 బంతుల్లో 16 పరుగులు చేసిన విజయ్ శంకర్, ఆ తర్వాత 14 బంతుల్లో 47 పరుగులు రాబట్టాడు. లూకీ ఫర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 25 పరుగులు రాబట్టాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ అవుతున్నారు..
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్ట్రైయిక్ రేటు 262.50. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున రెండే రెండు మ్యాచుల్లో 200+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేసిన విజయ్ శంకర్, మిగిలిన అన్నీ మ్యాచుల్లో 100-120 స్ట్రైయిక్ రేటు దాటకుండా చాలా జాగ్రత్త పడేవాడు..
విజయ్ శంకర్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో సోషల్ మీడియాలో ట్రోల్ తెగ వైరల్ అవుతున్నాయి. శంకరన్నా, శంకరన్నా ఎంతో ప్రేమగా పిలిచాం. ఒక్కసారైనా మా టీమ్‌కి ఇలా ఆడావా? అన్నా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీకి విజయ్ శంకర్‌ని సెలక్ట్ చేసినప్పుడు ‘త్రీడీ ప్లేయర్’లా ఉపయోగపడతాడని అప్పటి ఛీఫ్ సెలక్టర్ ఎమ్కెస్కే ప్రసాద్ కామెంట్ చేశాడు. అప్పటి నుంచి త్రీడీ ప్లేయర్‌గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విజయ్ శంకర్, సరిగ్గా 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో మళ్లీ ఫామ్‌లోకి రావడం కొసమెరుపు..
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై విజయ్ శంకర్ ఆడిన సెన్సేషనల్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్‌లో కొన్ని... ( Photo Souce: Instagram)