- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు సాధించిందెవరు..? చిన్న తాలా రికార్డుకు పోటీ వచ్చేనా..?
ఐపీఎల్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు సాధించిందెవరు..? చిన్న తాలా రికార్డుకు పోటీ వచ్చేనా..?
IPL 2023: ఐపీఎల్ -16 లో నేటి రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా తుది పోరు జరుగనుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్- 16 తుదిపోరుకు మరికొద్దిసేపట్లో తెరలేవనుంది. ఫైనల్ పోరు చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఫైనల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం..
ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు చిన్నతాలా అని పిలుచుకునే సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 8 ఫైనల్స్ ఆడి 35.57 సగటుతో 249 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
రెండో స్థానంలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఉన్నాడు. వాట్సన్.. 4 ఐపీఎల్ ఫైనల్స్ లో 236 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఓ అర్థ సెంచరీ కూడా ఉంది. అంతేగాక ఐపీఎల్ ఫైనల్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు వాట్సన్. ఫైనల్స్ తో అత్యధిక వ్యక్తిగత స్కోరు (117) అతడి పేరిటే ఉంది.
ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్.. 6 ఐపీఎల్ ఫైనల్స్ లో 30.50 సగటుతో 183 రన్స్ చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
సీఎస్కే మాజీ ఓపెనర్ మురళీ విజయ్ 4 ఐపీఎల్ ఫైనల్స్ ఆడి ఒక అర్థ సెంచరీతో 181 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్ లో అతడి వ్యక్తిగత స్కోరు 95. ఆర్సీబీపై విజయ్ ఈ ఘనత అందుకున్నాడు.
చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ధోని.. 8 ఐపీఎల్ ఫైనల్ ఇన్నింగ్స్ లలో 36 సగటుతో 180 పరుగులు చేశాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో ఫైనల్ లో 63 పరుగులు చేసిన ధోని నాటౌట్ గా నిలవడం గమనార్హం.