MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పాల్ వాల్తేటి... చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన ఈ సెన్సేషనల్ ప్లేయర్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు...

పాల్ వాల్తేటి... చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ చేసిన ఈ సెన్సేషనల్ ప్లేయర్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కారణంగా ఎంతోమంది క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. డేవిడ్ వార్నర్‌తో పాటు టి నటరాజన్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా, పాండ్యా బ్రదర్స్, వరుణ్ చక్రవర్తి.. ఇలా ఎందరో కెరీర్‌ను మార్చేసింది ఐపీఎల్. అలా ఐపీఎల్‌లో ఇరగదీసిన ఇండియన్ ప్లేయర్ పాల్ వాల్తేటి... ఇప్పుడు ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు?

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 21 2023, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ముంబైలో జన్మించిన పాల్ వాల్తేటి అసలు పేరు పాల్ చంద్రశేఖర్ వాల్తేటి. 2002 ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు వాల్తేటి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పాల్ వాల్తేటిని ఐపీఎల్ 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అదే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన వాల్తేటి, అజేయ సెంచరీతో పంజాబ్‌కి ఘన విజయాన్ని అందించాడు.
 

37

వాల్తేటి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 189 పరుగుల భారీ టార్గెట్‌ను 19.1 ఓవర్లలో చేధించింది పంజాబ్ కింగ్స్... ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ వాల్తేటియే...

47

2011 సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ చేసిన ప్లేయర్ పాల్ వాల్తేటి. ఐపీఎల్ కెరీర్‌లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోరు వాల్తేటిదే... మొత్తంగా 2011 సీజన్‌లో 463 పరుగులు చేశాడు వాల్తేటి. సీఎస్‌కేపై సెంచరీతో పాల్ వాల్తేటి పేరు మార్మోగిపోయింది.. 

57

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసిన పాల్ వాల్తేటి... ఆ తర్వాత 2012, 13 సీజన్లలో ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... దీంతో వన్ సీజన్ వండర్‌గానే మిగిలి, టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు...

67

వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో ఫెయిల్ అయిన వాల్తేటి... పూర్తిగా క్రేజ్ కోల్పోయాడు. అదీకాక అతని కెరీర్‌ని గాయాలు కూడా తెగ ఇబ్బంది పెట్టాయి. కెరీర్ ప్రారంభం నుంచి గాయాలతో సతమతమైన పాల్ వాల్తేటి కంటికి గాయం కావడంతో క్రికెట్‌కే పూర్తిగా దూరమయ్యాడు... 

77

స్పోర్ట్స్ కోటాలో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించిన పాల్ వాల్తేటి ప్రస్తుతం కంపెనీ తరుపున డొమెస్టిక్ టోర్నీలు ఆడుతూ, ముంబైలో కుర్రాళ్లకు బ్యాటింగ్‌లో మెలకువలు నేరిస్తూ, తన వంతు శిక్షణ ఇస్తున్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved