MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నీ బ్యాటింగ్ చూస్తుంటే పరమ బోరింగ్‌గా ఉంది... కెఎల్ రాహుల్‌పై కేవిన్ పీటర్సన్ కామెంట్స్...

నీ బ్యాటింగ్ చూస్తుంటే పరమ బోరింగ్‌గా ఉంది... కెఎల్ రాహుల్‌పై కేవిన్ పీటర్సన్ కామెంట్స్...

ఐపీఎల్‌లో  అట్టర్ ఫ్లాప్ అవుతున్న సీనియర్ ప్లేయర్లలో కెఎల్ రాహుల్ ఒకడు. గత మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన కెఎల్ రాహుల్, ఈసారి ఇప్పటిదాకా 6 మ్యాచుల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. సీనియర్లు రోహిత్ కోహ్లీ ఉన్నంతసేపు మెరుపులు మెరిపిస్తుంటే రాహుల్ మాత్రం జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Apr 20 2023, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో మెయిడిన్ కూడా ఇచ్చేశాడు. ఐపీఎల్‌లో 2014 నుంచి ఇప్పటిదాకా 27 ఫస్ట్ ఓవర్ మెయిడిన్లు రాగా, అందులో 11 మెయిడిన్లు కెఎల్ రాహుల్ ఇచ్చేయడం విశేషం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PTI Photo) (PTI04_19_2023_000222B)

PTI Photo) (PTI04_19_2023_000222B)

కెఎల్ రాహుల్‌కి తోడు మరో ఎండ్‌లో దూకుడుగా ఆడే కైల్ మేయర్స్‌ కూడా కెప్టెన్‌ని ఫాలో అయ్యి నెమ్మదిగా ఆడడంతో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్‌ని తీవ్రంగా విమర్శించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...

35
KL Rahul

KL Rahul

‘పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ చూడడం పరమ బోరింగ్‌గా ఉంది. ఐపీఎల్‌లో ఇంత బోరింగ్‌గా ఎప్పుడూ అనిపించలేదు...’ అంటూ టీవీ లైవ్‌లో కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్. ఓ వరల్డ్ క్లాస్ బ్యాటర్‌కి మాజీ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే పెద్ద అవమానం ఏమీ ఉండదు..
 

45
Image credit: PTI

Image credit: PTI

పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే లోకేశ్ రాహుల్ ఆట ఈ విధంగా ఉంది. మరీ పిచ్ బీభత్సంగా బ్యాటింగ్‌కి సహకరిస్తే తప్ప, కెఎల్ రాహుల్ రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడు. సీజన్లు మారుతున్న రాహుల్ బ్యాటింగ్‌ విధానంలో మాత్రం మార్పు రావడం లేదు...

55
KL Rahul

KL Rahul

ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, 2021 సీజన్‌లో 626, 2022లో 616 పరుగులు చేశాడు. 2023 సీజన్‌లో 6 మ్యాచులు ఆడి 194 పరుగులు చేసిన కెఎల్ రాహుల్.. 114.79 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved