MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని టెండూల్కర్, నన్ను బ్యాటుతో కొట్టాడు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని టెండూల్కర్, నన్ను బ్యాటుతో కొట్టాడు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మధ్య ఉన్న స్నేహం, చనువు కారణంగా వాళ్లిద్దరూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా నిలిచారు. ఒకరు బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడే ఫైర్ అయితే మరొకరు స్లో అండ్ స్టడీగా ప్రత్యర్థిని ముంచేసే నీటి ప్రవాహం... సచిన్ టెండూల్కర్‌తో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంభాషణలను బయటపెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 13 2023, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కూల్‌గా పాటలు పాడుతూ, భారీ సిక్సర్లు బాదడం వీరేంద్ర సెహ్వాగ్‌కి బాగా అలవాటు. ఈ విషయాన్ని చాలాసార్లు స్వయంగా వెల్లడించాడు వీరూ. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో సచిన్ టెండూల్కర్‌తో జరిగిన ఓ చిన్న సంఘటనను బయటపెట్టాడు వీరూ...

28

‘2011 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నాం. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత దెబ్బ తినకుండా ఉండేందుకు పాటలు పాడుతూ ఉంటాను. సచిన్ టెండూల్కర్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. సచిన్‌కి ఓవర్ల మధ్యలో మాట్లాడడం బాగా అలవాటు. అది ఆయనకి స్ట్రెస్ రిలీఫ్‌ని ఇస్తుంది..

38

సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ, పాటలు పాడుకుంటూ ఉన్నా. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్‌కి కోపం వచ్చేసింది. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని కోపంతో తన బ్యాటుతో కొట్టాడు...

48

‘‘ఇలాగే పాటలు పాడుతూ పోయావంటే నిన్ను కిషోర్‌ కుమార్‌ని చేసేస్తా...’’ అంటూ అన్నాడు. మేం బాగా ఆడుతున్నాం, పిచ్ కూడా బాగుంది. ఇంక మాట్లాడడానికి ఏముందంటుంది అన్నా? సచిన్ టెండూల్కర్ మాత్రం ఇదిగో ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అన్నాడు..

58

ఆ మ్యాచ్‌లో మేం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 140-150 పరుగులు చేశాం. ప్రతీ ఓవర్ ముగిసిన తర్వాత ఆ బౌలర్ ఎలా వేశాడు, అతని వ్యూహం ఏంటి? బలం ఏంటి? వంటి విషయాలు మాట్లాడడం సచిన్ టెండూల్కర్‌కి అలవాటు. క్రికెట్‌లో చాలామంది ఇదే చేస్తారు. అయితే నేను వాటిని పట్టించుకోను...

68
Sachin Sehwag

Sachin Sehwag

వాస్తవానికి బౌలర్ ఎలా వేస్తున్నాడు? బౌన్స్ వస్తుందా? స్పిన్ వస్తుందా? వంటి విషయాలను నేను అస్సలు పట్టించుకోను. అవన్నీ ఆలోచిస్తే ప్రెషర్‌లోకి వెళ్లిపోతాం. ఫ్రీగా ఆడలేమని అనుకుంటా. అందుకే ఏమీ పట్టించుకోకుండా నా స్టైల్‌లో నేను బ్యాటింగ్ చేస్తా...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

78
sachin sehwag

sachin sehwag

2011 వన్డే వరల్డ్ కప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకి వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కలిసి తొలి వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం అందించారు. సెహ్వాగ్ 66 బంతుల్లో 12 ఫోర్లతో 73 పరుగులు చేసి అవుట్ కాగా సచిన్ టెండూల్కర్ 101 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. 

88
Virender Sehwag

Virender Sehwag


వన్‌డౌన్‌లో వచ్చిన గౌతమ్ గంభీర్ 69 పరుగులు చేసినా, యువరాజ్ సింగ్ 12, ధోనీ 12, విరాట్ కోహ్లీ 1, హర్భజన్ 3 పరుగులు చేయగా యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, మునాఫ్ పటేల్ డకౌట్ కావడంతో టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది సౌతాఫ్రికా. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి ఎదురైన ఏకైక పరాజయం ఇదే.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
KKRకు బిగ్ షాక్ : ఐపీఎల్ 2026 నుండి స్టార్ పేసర్ హర్షిత్ రాణా అవుట్.. ఏమైంది?
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
Recommended image3
Kavya Maran : భారత్ అంటే పడని పాక్ ఆటగాడికి కోట్ల రూపాయలా? బీసీసీఐ ఏం చెప్పింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved