- Home
- Sports
- Cricket
- క్రికెట్ జ్ఞానం లేనివాళ్లే, సచిన్ టెండూల్కర్‌తో నన్ను పోలుస్తారు... రాబిన్ ఊతప్పతో విరాట్ కోహ్లీ...
క్రికెట్ జ్ఞానం లేనివాళ్లే, సచిన్ టెండూల్కర్‌తో నన్ను పోలుస్తారు... రాబిన్ ఊతప్పతో విరాట్ కోహ్లీ...
సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో పరుగులు ప్రవాహం సృష్టిస్తున్న బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ 100 శతకాలు బాదితే, విరాట్ కోహ్లీ 15 ఏళ్ల కెరీర్‌లో 75 సెంచరీలు చేశాడు. అయితే తనని సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...

sachin kohli
క్రికెట్ ప్రపంచంలో అత్యధిక మ్యాచులు, అత్యధిక పరుగులు, అత్యధిక శతకాలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ప్లేయర్‌గా తిరుగులేని, చెదిరిపోని రికార్డులెన్నో క్రియేట్ చేసి... ‘మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు సచిన్ టెండూల్కర్...
తన ఆటతో యావత్ భారతాన్ని స్థంభించిపోయేలా చేసిన సచిన్, ‘క్రికెట్ గాడ్’గా కీర్తి ఘడించాడు. నేటి సోషల్ మీడియాలో యుగంలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విరాట్ కోహ్లీ, దశాబ్దకాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచి ‘క్రికెటర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు గెలిచాడు. అయితే తనను సచిన్‌తో పోల్చి చూడడం మూర్ఖత్వం అంటున్నాడు విరాట్ కోహ్లీ...
‘సచిన్ టెండూల్కర్‌నీ, నన్ను పోల్చి ఎవరు మాట్లాడినా నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే క్రికెట్ జ్ఞానం లేనివాళ్లే ఇలాంటి పోలికలు తెస్తారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అంటే కేవలం ఆయన చేసిన పరుగులు, గణాంకాలు, అదీ ఇదీ కాదు.. లెక్కల్లో గణించలేనిది ఎంతో ఉంది..
నేడు స్టార్ క్రికెటర్లు రాణిస్తున్న ఎందరో సచిన్ టెండూల్కర్ ఆటను చూసి మొదట బ్యాట్ పట్టుకున్నారు. క్రికెట్‌కి ఇంతటి గుర్తింపు రావడానికి ఆయనే కారణం. చిన్నతనంలోనే సచిన్ నాపై ఎంతో ప్రభావం చూపించారు. నాలా ఎందరో, ఇంకెందరో..
నాలాంటి ఎందరికో సచిన్ టెండూల్కర్ అంటే ఓ పేరు కాదు, ఆయన ఓ ఎమోషన్. క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా సచిన్ టెండూల్కర్‌ని గురువుగా భావిస్తారు, ఆరాధిస్తారు. ఆయన క్రీజులో ఉంటే ఇండియా గెలుస్తుందని దేశమంతా నమ్మింది. ప్రత్యర్థి ప్లేయర్లు కూడా నమ్మేవారు. సచిన్ ఆడుతుంటే జీవితం చాలా హాయిగా ఉండేది..
సచిన్ టెండూల్కర్, వీవ్ రిచర్డ్స్‌తో ఎవ్వరినీ పోల్చి చూడకూడదు. ఎందుకంటే వాళ్లు ఓ శకాన్ని నిర్మించారు, శాసించారు. ఒక్క ప్లేయర్‌ని నమ్మించి, దేశమంతా ప్రశాంతంగా పడుకుందంటే ఆ నమ్మకం చాలా విలువైనది. అలాంటివి చాలా అరుదు...’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..