MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • దీన్ని టీమ్ అంటారా అసలు... టెస్టులు ఆడే వాళ్లను తీసుకొచ్చి, హైదరాబాద్‌కి అంటకట్టారు...

దీన్ని టీమ్ అంటారా అసలు... టెస్టులు ఆడే వాళ్లను తీసుకొచ్చి, హైదరాబాద్‌కి అంటకట్టారు...

ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ ఫెవరెట్స్‌లో ఒకటిగా కనిపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ గెలిచిన అయిడిన్ మార్క్‌రమ్‌ని కెప్టెన్‌గా సెలక్ట్ చేయడంతో ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు ఫ్యాన్స్. సీజన్ మొదలయ్యాక ఆ ఆశలన్నీ బత్తాయి రసంలో కలిసిపోయాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 25 2023, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
PTI Photo)(PTI04_24_2023_000259B)

PTI Photo)(PTI04_24_2023_000259B)

మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఆ విజయాల జోష్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్, ఆ తర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

29

ఐపీఎల్ 2023 సీజన్‌లో పరమ వీక్ టీమ్‌గా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్...7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మరో మ్యాచ్ ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కినట్టే...

39
PTI Photo/R Senthil Kumar) (PTI04_21_2023_000270B)

PTI Photo/R Senthil Kumar) (PTI04_21_2023_000270B)

ఐపీఎల్ 2023 సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 15 ప్లేయర్లలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒక్కరు కూడా లేకపోవడం మన బ్యాటింగ్ ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆఖరి సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ బాదిన హారీ బ్రూక్ కూడా 7 మ్యాచుల్లో కలిపి చేసిన పరుగులతో టాప్ 15లో చేరలేకపోయాడు. 

49

హారీ బ్రూక్ టెస్టుల్లో సెన్సేషనల్ ప్లేయర్. టీ20ల్లో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు అప్పుడప్పుడూ అలా ఓ సెంచరీలా వస్తాయంతే. అలాగే రూ.8.25 కోట్లు పెట్టి కొన్న మయాంక్ అగర్వాల్ కూడా టెస్టు బ్యాటరే... రాహుల్ త్రిపాఠి, కేకేఆర్‌లో బాగా ఆడేవాడు..
 

59
Image credit: PTI

Image credit: PTI

గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున కూడా బాగా ఆడాడు. అయితే అతన్ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి కుళ్లబెట్టిన టీమిండియా, సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా చేసింది. దీంతో అతను కూడా ఫామ్ కోల్పోయాడు. వాషింగ్టన్ సుందర్‌కి టెస్టుల్లో మంచి రికార్డు ఉంది..

69

అతని నుంచి టీ20ల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆశించి, భంగపడిన ఆర్‌సీబీ... చివరికి వదిలేసింది. టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో ఒక్క హెన్రీచ్ క్లాసిన్ తప్ప మరో ప్లేయర్ ఐపీఎల్‌లో టీ20 ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి 21, హారీ బ్రూక్ 14 బంతులు ఆడి కలిపి చేసింది 22 పరుగులే. వీళ్లిద్దరూ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు..
 

79

ఆఖరి ఓవర్‌లో ఒక్క సిక్సర్ కొట్టి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది. కానీ వాషింగ్టన్ సుందర్ కానీ మార్కో జాన్సెన్ కానీ ఆ పని చేయలేకపోయారు. జాన్సెన్ కొడతాడేమోనని సుందర్ సింగిల్ తీసి స్ట్రైయిక్ ఇస్తే, నువ్వు కొట్టు బ్రో అన్నట్టు జాన్సెన్ తిరిగి సింగిల్ తీసి సుందర్‌కే స్ట్రైయిక్ ఇచ్చాడు...
 

89
Image credit: PTI

Image credit: PTI

మొత్తానికి ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు క్లైమాక్స్‌కి చేరుకున్నట్టే. సగం మ్యాచుల్లో తేలిపోయిన టీమ్, మిగిలిన సగం మ్యాచుల్లో సెన్సేషనల్ పర్ఫామన్స్ ఇస్తే కానీ ప్లేఆఫ్స్‌కి చేరలేదు. ఆడించాలనుకున్నా రిజర్వు బెంచ్‌లో అదిరిపోయే టీ20 రికార్డున్న ప్లేయర్లు కూడా ఎవ్వరూ లేరు...

99

సీజన్ ఆరంభంలో సూపర్ స్ట్రాంగ్‌ టీమ్‌కి కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ‘దీన్ని టీమ్ అంటార్రా అస్సలు’ అని ఫ్యాన్స్ ఫ్రస్టేషన్‌కి గురయ్యేలా చేసింది. ఇక మిగిలింది పరువు కాపాడుకుంటూ ఆఖరి పొజిషన్‌లో నిలవకుండా ఊరట విజయాలు అందుకోవడమే..  

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image3
SRH : సన్‌రైజర్స్ కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్.. పాక్ ప్లేయర్‌కు రూ. 2.34 కోట్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved