- Home
- Sports
- Cricket
- మీకు మరో ఆప్షన్ లేదు! వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లను పక్కనబెట్టి, ఈ ఇద్దరు కుర్రాళ్లను ఆడించండి...
మీకు మరో ఆప్షన్ లేదు! వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లను పక్కనబెట్టి, ఈ ఇద్దరు కుర్రాళ్లను ఆడించండి...
ఐపీఎల్ 2023 సీజన్‌లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, నేహాల్ వదేరా... ఇలా ఈసారి స్టార్ ప్లేయర్లుగా, మ్యాచ్ విన్నర్లుగా మారిన కుర్రాళ్ల సంఖ్య బాగానే ఉంది...

PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000369B)
రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌గానే కాకుండా, 13 మ్యాచుల్లో 575 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా నిలిచాడు.
Image credit: PTI
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు..
అలాగే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, అద్వితీయ రికార్డు నెలకొల్పిన రింకూ సింగ్ కూడా 2023 సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌లో 50 సగటుతో 400లకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న రింకూ సింగ్.. ఇప్పటిదాకా 3 హాఫ్ సెంచరీలు, మరో ఐదు సార్లు 40+ స్కోర్లు నమోదు చేశాడు...
‘టీమిండియా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గెలవాలని కచ్చితంగా అనుకుంటే యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌లను వెంటనే టీమ్‌లోకి తీసుకుని, ఆడించాలి.
ఎందుకంటే ఈ కుర్రాళ్లు, ఫాస్ట్ ట్రాక్‌లాంటోళ్లు. వాళ్లు వరల్డ్ కప్ ఆడేందుకు పెద్దగా సమయం ఏమీ పట్టదు. వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ వీళ్లు కీ రోల్ పోషిస్తారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
Sanju and Jaiswal
‘యశస్వి జైస్వాల్ లాంటి బ్యాటర్, టీమ్‌లో ఉంటే వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా హాట్ ఫెవరెట్ అవుతుంది. నేను సెలక్టర్‌గా ఉంటే అతన్ని టీమ్‌లోకి తీసుకోవడానికి ఏం చేయడానికైనా రెఢీ...
Yashasvi Jaiswal
50 ఓవర్ల ఫార్మాట్‌కి ఆదరణ తగ్గుతున్న సమయంలో జైస్వాల్ లాంటి ప్లేయర్లు, వన్డేలకు పూర్వ వైభవం తేగలరు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్..