- Home
- Sports
- Cricket
- రాజస్థాన్ రాయల్స్ సంగతేంటి? సీజన్ ఫస్టాఫ్‌లో టేబుల్ టాపర్‌గా ఉండి, ఇప్పుడు ప్లేఆఫ్స్ నుంచి...
రాజస్థాన్ రాయల్స్ సంగతేంటి? సీజన్ ఫస్టాఫ్‌లో టేబుల్ టాపర్‌గా ఉండి, ఇప్పుడు ప్లేఆఫ్స్ నుంచి...
ఐపీఎల్‌లో ఏ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పడం చాలా కష్టం. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్‌లో ఆఖరి స్థానాల్లో నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేని గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచింది...

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2023 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, ఈసీజన్‌లోనూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించి... ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. 18 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆఖరి మ్యాచ్‌లో ఓడినా టాప్‌లోనే ఉంటుంది...
గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్ ఆడడం, అది గెలిస్తే వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ ఆడడం ఖాయం. అయితే సీజన్ ఫస్టాఫ్‌లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఇలాంటి పర్ఫామెన్సే చూపించింది.. గత సీజన్ ఫైనలిస్ట్, మొదటి 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుంది...
అయితే ఆ తర్వాత 8 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ రెండే రెండు విజయాలు అందుకుంది. 13 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కనీసం 14 పరుగుల తేడాతో గెలవాలి...
ఛేదనలో అయితే 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో గెలిచినంత మాత్రం రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్‌కి చేరదు...
నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ ఆఖరి లీగ్ మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే మూడు జట్ల మధ్య నెట్ రన్ రేట్ ప్రామాణీకంగా మారి, రాజస్థాన్ రాయల్స్‌కి అవకాశాలు పెరుగుతాయి...
ఊహాత్మిక తప్పిదాలు, కీ ప్లేయర్లను సరిగ్గా వాడుకోకపోవడం ఇలా రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరలేకపోవడానికి కారణాలు ఎన్నో. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 118 పరుగులకి ఆలౌట్ అయిన రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది...
PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000369B)
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 214 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయిన రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ 212 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది.
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, సిమ్రాన్ హెట్మయర్, దేవ్‌దత్ పడిక్కల్,... ఇలా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు.
Sportzpics for IPL/PTI Photo)(PTI05_11_2023_000376B)
రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కుల్దీప్ సేన్... ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నారు. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో టీమ్ కాంబినేషన్ విషయంలో చేసిన ప్రయోగాలు, రాయల్స్‌ని చావు దెబ్బ తీశాయి.