- Home
- Sports
- Cricket
- ముంబై, సీఎస్‌కే వల్లే కాలేదు! ఎలిమినేటర్ ఆడి, టైటిల్ గెలిచిన ఒకే ఒక్క టీమ్‌గా సన్‌రైజర్స్ హైదరబాద్...
ముంబై, సీఎస్‌కే వల్లే కాలేదు! ఎలిమినేటర్ ఆడి, టైటిల్ గెలిచిన ఒకే ఒక్క టీమ్‌గా సన్‌రైజర్స్ హైదరబాద్...
ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వు డేకి మారింది. సరిగ్గా ఇదే రోజు (మే 29న) 2016 ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి మొట్టమొదటి ఐపీఎల్ కైవసం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి, వరుసగా మూడు విజయాలతో ఐపీఎల్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి, ఒకే ఒక్క జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. అంతకుముందు, ఆ తర్వాత ఏ జట్టూ కూడా ప్లేఆఫ్స్‌లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 విజయాలతో టైటిల్ గెలిచింది లేదు...
ఐపీఎల్ 2016 సీజన్ ఎలిమినేటర్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న గుజరాత్ లయన్స్‌ని ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లతో నిండిన ఆర్‌సీబీ, టైటిల్ ఫెవరెట్‌గా 2016 సీజన్ ఫైనల్ ఆడింది..
డేవిడ్ వార్నర్ 69, బెన్ కట్టింగ్ 39, యువరాజ్ సింగ్ 38, శిఖర్ ధావన్ 28 పరుగులతో చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కలిసి తొలి వికెట్‌కి 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు..
10.2 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసిన ఆర్‌సీబీ, ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. 76 పరుగులు చేసిన క్రిస్ గేల్‌ని బెన్ కట్టింగ్, 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని బరిందర్ స్రాన్ అవుట్ చేశారు.
ఆర్‌సీబీ విజయానికి 44 బంతుల్లో 68 పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో సన్‌రైజర్స్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. ఏబీ డివిల్లియర్స్ 5, కెఎల్ రాహుల్ 11, షేన్ వాట్సన్ 11 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ... 20 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేసి 8 పరుగుల తేడాతో ఓడింది..
2016 సీజన్‌లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు, 81.08 సగటుతో 16 ఇన్నింగ్స్‌ల్లో 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆరెంజ్ క్యాప్ గెలిచినా... ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయాడు.
డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో మొట్టమొదటి టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుసగా నాలుగు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది.
2017, 2019, 2020 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2018లో కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఫైనల్‌కి వెళ్లినా చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 2016లో డేవిడ్ వార్నర్ చేసిన 69 పరుగులే, కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు...
2021లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గలేకపోయింది. 2023 సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్, రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడింది. ఇలా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టాప్ టీమ్స్‌కి కూడా సాధ్యం కాని రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది..