- Home
- Sports
- Cricket
- కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్ చేసిన పని, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేయగలదా... టాప్ టీమ్‌ని ఓడిస్తేనే..
కేకేఆర్, ఆర్‌సీబీ, పంజాబ్ చేసిన పని, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేయగలదా... టాప్ టీమ్‌ని ఓడిస్తేనే..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. మొదటి 11 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే...

Image credit: PTI
టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. అదే జరిగితే సన్‌రైజర్స్ హైదరాబాద్ అస్సాం ట్రైన్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది..
చేతుల్లోకి వచ్చిన మ్యాచులను జారవిడిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ నుంచి 8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ వరకూ వరుసగా ఐదు టీమ్స్ ఆరేసి విజయాలతో ఉన్నాయి..
Image credit: PTI
లక్నో సూపర్ జెయింట్స్‌కి వర్షం కారణంగా ఓ పాయింట్ అదనంగా రావడంతో కృనాల్ టీమ్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ నేటి మ్యాచ్‌లో గెలిస్తేనే లీగ్‌లో ఉంటుంది..
ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 31 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్...
టేబుల్ టాప్ 2లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ని 6 వికెట్ల తేడాతో ఓడించి... ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఆర్‌సీబీ ఆట వేరే లెవెల్...
Image credit: PTI
ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని 59 పరుగులకి ఆలౌట్ చేసి, 112 పరుగుల తేడాతో అఖండ విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఈ నాలుగు జట్లు అందుకున్న విజయాల కారణంగా 2023 సీజన్ ప్లేఆఫ్స్ బెర్త్‌లపై క్లారిటీ వచ్చేందుకు ఆఖరి లీగ్ మ్యాచ్ దాకా ఆగాల్సిన పరిస్థితి. అయితే నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడితే, ఆ సస్పెన్స్ కాస్త తగ్గుతుంది..
ఎందుకంటే 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్, 18 పాయింట్లకు చేరుకుని ఫ్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమిట్ అవుతుంది. కాబట్టి 2023 సీజన్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చే బాధ్యత ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీపై పడింది..