మార్క్‌రమ్ మామ ఇదేం పని! ఆ ప్లేయర్ ఆడుతున్నాడని చెప్పి, డగౌట్‌లో కూర్చోబెట్టి...
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు అయిడిన్ మార్క్‌రమ్. సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ టీమ్‌కి టైటిల్ అందించిన మార్క్‌రమ్, భారీ అంచనాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు...

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 11 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 7 మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. ఈజీగా గెలుస్తుందని అనుకున్న మ్యాచుల్లో కూడా ఆరెంజ్ ఆర్మీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
(PTI Photo)(PTI04_23_2023_000291B)
రూ.13.25 కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్‌తో పాటు రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో సరైన టీమ్ కాంబినేషన్ సెట్ చేసేందుకు చాలా రకాల ప్లేయర్లను ప్రయత్నించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
ప్లేఆఫ్స్ రేసులో సూపర్ స్ట్రాంగ్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వరకూ గెలిచేలా కనిపించిన ఆరెంజ్ ఆర్మీ, అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ కారణంగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది..
Aiden Markram
ఆ ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు, ఓ వైడ్‌తో కలిపి 31 పరుగులు సమర్పించిన అభిషేక్ శర్మ, చేతుల దాకా వచ్చిన మ్యాచ్‌ని లక్నో చేతుల్లో పెట్టేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది..
Image credit: PTI
టాస్ సమయంలో రిఫరీకి ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఉన్న ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ లిస్టులో ఉన్న ప్లేయర్, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎక్కడా కనిపించకపోవడం విశేషం...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్‌లో సన్విర్ సింగ్ ఉన్నట్టుగా రిఫరీగా సమర్పించిన జట్టులో ఉంది. అయితే మీడియాకి అందిన లిస్టులో మాత్రం సన్విర్ సింగ్ ప్లేస్‌లో టి నటరాజన్ పేరు ఉంది. ఇంపాక్ట్ సబ్స్ లిస్టులో ఉన్న సన్విర్ సింగ్, లక్నోతో మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేయలేదు...
సన్విర్ సింగ్‌ని ఆడించాలని ముందుగా అనుకుని ఆ తర్వాత ప్లాన్ మార్చుకున్నారా? లేక అనుకోకుండా లిస్టు సమర్పించే సమయంలో పేరు అటు ఇటు అయ్యాయా? అనేది తేలీదు కానీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ స్కాట్ స్ట్రైరిస్ ఈ విషయంపై సీరియస్ అయ్యాడు...
Image credit: PTI
‘సన్విర్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేస్తున్నాడేమో అనుకున్నా. చూస్తే అతను ఎక్కడా లేడు. నాలా అతని కుటుంబం, సన్నిహితులు అతని ఆట కోసం ఎదురుచూస్తూ ఉంటే ఎంత నిరుత్సాహపడతారు. దీనికి మార్క్‌రమ్‌దే బాధ్యత. ఎందుకు ఇలా జరిగిందో చెప్పాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు స్కాట్ స్ట్రైరిస్..
Vivrant Sharma
అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చిన వివ్‌రాంత్ శర్మతో కూడా బౌలింగ్ చేయించలేదు అయిడిన్ మార్క్‌రమ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వివ్‌రాంత్ శర్మ, కేవలం ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు.
పార్ట్ టైం బౌలర్ అభిషేక్ శర్మకు బదులుగా వివ్‌రాంత్‌తో బౌలింగ్ చేయించి ఉన్నా మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేదంటున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్..