- Home
- Sports
- Cricket
- కేకేఆర్‌కి భారీ దెబ్బ! ఐపీఎల్ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరం... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా...
కేకేఆర్‌కి భారీ దెబ్బ! ఐపీఎల్ మొత్తానికి శ్రేయాస్ అయ్యర్ దూరం... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా...
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను సమస్యతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్‌లో ఆడని అయ్యర్, రెండేళ్ల గ్యాప్‌లో మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి దూరంగా ఉండబోతున్నాడు..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్ గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. శస్త్ర చికిత్స తర్వాత శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించినట్టు వార్తలు వస్తున్నాయి..
దీంతో శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా సక్సెస్ సాధించినా, సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
Shreyas Iyer
దాంతో అతన్ని 2022 మెగా వేలానికి వదిలేసి, శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో 14 మ్యాచులు ఆడిన కేకేఆర్, 6 మ్యాచుల్లో గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది...
Image credit: Getty
శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా జూన్ మొదటి వారంలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు. అహ్మదాబాద్ టెస్టు రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనే వెన్ను నొప్పితో క్రీజుని వీడాడు శ్రేయాస్ అయ్యర్...
గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌కి రాకపోవడంతో టీమిండియా 10 మంది బ్యాటర్లతోనే బరిలో దిగింది. శ్రేయాస్ అయ్యర్ గాయంతో తప్పుకోవడంతో హనుమ విహారికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే అవకాశం దక్కవచ్చు...
Image credit: PTI
నాగ్‌పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్‌పై ప్రత్యేకమైన మమకారం. దీంతో అతనికి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఛాన్సు దక్కినా దక్కొచ్చు..