MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నీ వల్లే ఓడిపోయాం! డీఆర్‌ఎస్ తీసుకునే తెలివి కూడా లేదా... శివమ్ దూబే, సందీప్ శర్మలను తిడుతున్న ధోనీ ఫ్యాన్స్..

నీ వల్లే ఓడిపోయాం! డీఆర్‌ఎస్ తీసుకునే తెలివి కూడా లేదా... శివమ్ దూబే, సందీప్ శర్మలను తిడుతున్న ధోనీ ఫ్యాన్స్..

ప్రతీ ఆటలో గెలుపు ఓటములు సహజం. అయితే ప్లేయర్లు తీసుకున్నంత తేలిగ్గా ఆ మ్యాచ్‌లను చూసే అభిమానులు తీసుకోలేరు. అందుకే ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు స్టేడియంలో బోరున ఏడిచే అభిమానులతో పాటు సరిగ్గా ఆడలేదని ప్లేయర్లను తిడుతూ పోస్టులు పెట్టే వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 13 2023, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. యంగ్ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా శివమ్ దూబే, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ ముగ్గురూ చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit: Shivam Dube Instagram

Image Credit: Shivam Dube Instagram

9 బంతుల్లో 8 పరుగులు చేసిన శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సాధారణంగా ఎల్బీడబ్ల్యూ అవుట్ ఇస్తే బ్యాటర్లు, 99 శాతం డీఆర్‌ఎస్ తీసుకుంటారు. కానీ శివమ్ దూబే మాత్రం అజింకా రహానేని ఫాలో అయ్యాడు..

36

ఎంతో అంతర్జాతీయ అనుభవం ఉన్న అజింకా రహానే, వికెట్ల ముందు తాను దొరికిపోయిన విషయాన్ని పసిగట్టి, డీఆర్‌ఎస్ వేస్ట్ చేయడం ఇష్టం లేక అలా వెళ్లిపోయాడు. శివమ్ దూబే కూడా తాను కూడా అలా వెళ్లిపోతే బెటర్ అని అనుకున్నాడు. కానీ టీవీ రిప్లైలో బంతి, వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించింది..
 

46

దీంతో శివమ్ దూబేని తిడుతూ సోషల్ మీడియాలో బూతుల వర్షం కురిపిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. కనీసం డీఆర్‌ఎస్ తీసుకునే తెలివి లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే శివమ్ దూబేని పంపడం కంటే ధోనీ ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాడని ట్రోల్స్ చేస్తున్నారు..
 

56

మరోవైపు ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణమైన సందీప్ శర్మను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. తన వల్లే సీఎస్‌కే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయిందని, అతన్ని, అతని కుటుంబాన్ని బూతులు తిడుతూ సైబర్ దాడి చేస్తున్నారు...

66
sandeep sharma dhoni

sandeep sharma dhoni


వీరిలో చాలామంది గత సీజన్లలో ధోనీ బాగా ఆడడం లేదని,  ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని అతన్ని, తన కుటుంబాన్ని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ‘ఓవర్ యాక్షన్’ బ్యాచే... మొదటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయిన రోహిత్ శర్మకు కూడా ఇలాంటి ఫ్యాన్స్ అటాక్ తప్పలేదు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image2
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved