- Home
- Sports
- Cricket
- యాడ్స్ ద్వారానే రూ.10,120 కోట్లు... ఐపీఎల్ 2023 సీజన్ మామూలు హిట్టు కాదు బాబోయ్! బ్లాక్ బస్టర్ హిట్టే...
యాడ్స్ ద్వారానే రూ.10,120 కోట్లు... ఐపీఎల్ 2023 సీజన్ మామూలు హిట్టు కాదు బాబోయ్! బ్లాక్ బస్టర్ హిట్టే...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఫ్రాంఛైజీలను తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాల ఎఫెక్టుకి తోడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత వ్యూయర్‌షిప్ రాలేదు.

కొత్త టీమ్స్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కి చేరడంతో పాటు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కి వచ్చింది. ఫైవ్ టైమ్ టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది..
ముంబై ఇండియన్స్ ఆఖరి పొజిషన్‌లో నిలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో నిలిచింది. ఇలా ఎన్నో కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్ ఫ్లాప్ కావడంతో 2023 సీజన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది బీసీసీఐ. నాలుగేళ్ల తర్వాత హోం, అవే పద్ధతిలో నిర్వహించిన 2023 సీజన్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం, మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అని జరిగిన ప్రచారంతో పాటు లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులు... ఐపీఎల్ 2023 సీజన్‌ని బ్లాక్ బస్టర్ హిట్టు చేశాయి..
2023 ఐపీఎల్ మొబైల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసిన వయాకాం18, జియో సినిమా యాప్‌లో ఉచితంగా మ్యాచులను చూసే అవకాశం కల్పించింది. దీంతో ఐపీఎల్ 2023 మ్యాచులకు రికార్డు స్థాయిలో 3.6 కోట్ల రియల్ టైం వ్యూస్ నమోదయ్యాయి..
Image credit: PTI
తాజాగా తేలిన లెక్కల ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో కేవలం ప్రకటనల ద్వారానే రూ.10,120 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి వయాకాం, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఐదేళ్లకు 2023-27 వరకూ రూ.48,390 కోట్లు పెట్టి ప్రసార హక్కులను కొనుగోలు చేసిన సంస్థలకు తొలి సీజన్‌లోనే 25 శాతానికి పైగా (వేలం లైవ్‌తో కలుపుకుని) రిటర్న్ వచ్చేసింది..
మున్ముందు మరో రెండు ఫ్రాంఛైజీలను కూడా తీసుకొచ్చి 12 టీమ్స్‌తో ఐపీఎల్ నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ. ఇదే జరిగితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్కెట్ మరింత పెరిగి, ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది..
Image credit: PTI
అదీకాకుండా వచ్చే సీజన్లలో వయాకాం18, జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు సబ్‌స్క్రిప్షన్ రూపంలో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయనుంది. ఈ విధంగా వచ్చే మొత్తం కలుపుకుని, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న కంపెనీలకు కూడా భారీగా లాభాలు అందించనుంది ఐపీఎల్..