- Home
- Sports
- Cricket
- ఇంత బక్కగా ఉన్నావ్, అలాంటి షాట్స్ ఎలా కొడుతున్నావ్... యశస్వి జైస్వాల్‌తో రోహిత్ శర్మ...
ఇంత బక్కగా ఉన్నావ్, అలాంటి షాట్స్ ఎలా కొడుతున్నావ్... యశస్వి జైస్వాల్‌తో రోహిత్ శర్మ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 124 పరుగులు చేసి, వేరే లెవెల్ ఇన్నింగ్స్ ఆడాడు యశస్వి జైస్వాల్...

Image credit: PTI
2020 అండర్19 వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్, 2023లో 9 మ్యాచులు ఆడి ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీతో 428 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు..
Image credit: PTI
ముంబై ఇండియన్స్‌పై 16 ఫోర్లు, 8 సిక్సర్లతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌పై టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
‘జైస్వాల్‌ని గత ఏడాది నుంచి గమనిస్తున్నా. అతని ఆట మరో లెవెల్‌కి వెళ్లింది. చూడడానికి ఇంత బక్కగా ఉన్నావ్, అలాంటి షాట్లు ఎలా కొట్టగలుగుతున్నావ్ అని అతన్ని అడిగాను. జిమ్‌కివెళ్తున్నానని చెప్పాడు...
ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం మంచిది. అతనికి, టీమిండియాకి, రాజస్థాన్ రాయల్స్‌కి కూడా.. ’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ. భీకరమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌కి త్వరలోనే టీమిండియా నుంచి పిలుపు వస్తుందని సంకేతాలు ఇచ్చాడు రోహిత్ శర్మ..
‘యశస్వి జైస్వాల్ సెంచరీకి రావాల్సిన ఫలితం దక్కకపోయినా, అతనికి ఇది వ్యక్తిగతంగా ఎంతో ఉపయోగపడుతుంది. జైస్వాల్ బ్యాటు నుంచి సెంచరీ వస్తుందని నేను ముందే ఊహించాను.
Yashasvi Jaiswal
గత మ్యాచ్‌లో అతను 70+ పరుగులు చేశాడు. అప్పుడే మనోడు సెంచరీ కొట్టబోతున్నాడని తెలిసింది..’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్..