- Home
- Sports
- Cricket
- టీమ్‌కి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ ఆడలేదు, టీమిండియాకి కానీ, ఐపీఎల్‌లో కానీ... - మాథ్యూ హేడెన్
టీమ్‌కి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ ఆడలేదు, టీమిండియాకి కానీ, ఐపీఎల్‌లో కానీ... - మాథ్యూ హేడెన్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో నిలిచిన ముంబై ఇండియన్స్, 2023 సీజన్‌లో బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చి, రెండో క్వాలిఫైయర్‌లో ఓడింది...
- FB
- TW
- Linkdin
Follow Us
)
PTI Photo/R Senthil Kumar)(PTI05_24_2023_000212B)
జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ వంటి కీ బౌలర్లు గాయపడడం ముంబై ఇండియన్స్ టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా వంటి బేస్ ప్రైజ్ బౌలర్లతోనే ప్లేఆఫ్స్ దాకా వెళ్లింది ముంబై ఇండియన్స్...
రెండో క్వాలిఫైయర్‌లో 234 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఫ్లాప్ అయ్యాడు. ఇషాన్ కిషన్ గాయంతో బ్యాటింగ్‌కి కూడా రాకపోవడంతో నేహాల్ వదేరాతో ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ, 7 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
‘రోహిత్ శర్మ స్టార్ బ్యాటరే కానీ టీమ్‌కి అవసరమైనప్పుడు అతను బాగా ఆడడం ఎప్పుడూ చూడలేదు. టీమిండియాకి కానీ ముంబై ఇండియన్స్‌కి కానీ రోహిత్ శర్మ అవసరం ఉన్నప్పుడు అతను ఫ్లాప్ అవుతూనే వచ్చాడు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్...
PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000200B)
మాథ్యూ హేడెన్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 219 టోర్నీలో 5 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే రోహిత్ శర్మ టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో గెలిపించిన సందర్భాలు లేవు..
Image credit: Getty
2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫెయిలైన రోహిత్ శర్మ, 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ బ్యాటు నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు..
Image credit: PTI
టీ20 వరల్డ్ కప్ 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్ 2022, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021లో కూడా రోహిత్ శర్మ నుంచి టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్‌పై భారీ ఆశలే పెట్టుకుంది భారత జట్టు..