- Home
- Sports
- Cricket
- తోపు ప్లేయర్లు ఆడినా కోహ్లీ తప్ప ఏ ఒక్క బ్యాటరూ వెయ్యి పరుగులు చేయలే.. ఆర్సీబీ రూటే సెపరేటు
తోపు ప్లేయర్లు ఆడినా కోహ్లీ తప్ప ఏ ఒక్క బ్యాటరూ వెయ్యి పరుగులు చేయలే.. ఆర్సీబీ రూటే సెపరేటు
RCB: పరుగుల ప్రవాహం ఏరులై పారే ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆర్సీబీ ఖాతాలో ఓ విచిత్రమైన రికార్డు ఉంది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ తప్ప మరే ఇండియన్ బ్యాటర్ వెయ్యి పరుగుల మార్కును చేరుకోలేదు.

ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ టీమ్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గెలుస్తామనుకున్న మ్యాచ్ ను ఓడిపోతూ ఆశలే లేవనుకున్న మ్యాచ్ లో గెలుస్తూ చిత్ర విచిత్రంగా ఆడే ఆర్సీబీకి ఐపీఎల్ లో రికార్డులు కూడా ఘనంగానే ఉన్నాయి. ఐపీఎల్ లో ఇప్పటికీ అత్యధిక స్కోరుతో పాటు అత్యల్ప స్కోరు కూడా ఆ జట్టు పేరిటే ఉంది.
అయితే పరుగుల ప్రవాహం ఏరులై పారే ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆర్సీబీ ఖాతాలో ఓ విచిత్రమైన రికార్డు ఉంది. బెంగళూరు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్ప మరే ఇండియన్ బ్యాటర్ వెయ్యి పరుగుల మార్కును చేరుకోలేదు. అలా అని వాళ్లు మిగతా జట్లలో ఆడినప్పుడు చేయలేదంటే అదీ కాదు. అక్కడ చేశారు. కానీ ఆర్సీబీ తరఫున మాత్రం కోహ్లీ ఒక్కడే వెయ్యి పరుగులు చేసిన ఆటగాడు.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి బెంగళూరుకు రాహుల్ ద్రావిడ్, పార్థీవ్ పటేల్, రాబిన్ ఊతప్ప, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దినేశ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, కేదార్ జాదవ్ వంటి ఎందరో ఆ టీమ్ కు ఆడారు. కానీ ఒక్కరు కూడా ఆర్సీబీకి ఆడుతూ వెయ్యి పరుగుల మార్కుకు చేరకపోవడం గమనార్హం.
ఆర్సీబీకి స్టార్ బ్యాటర్ కోహ్లీ 7,044 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ రాహుల్ ద్రావిడ్. మిస్టర్ డిపెండబుల్ ఆర్సీబీ తరఫున 898 పరుగులు చేశాడు. ఆ తర్వాత జాబితాలో పడిక్కల్ (884), పార్థీవ్ పటేల్ (731), దినేశ్ కార్తీక్ (611), మన్‌దీప్ సింగ్ (597), సౌరభ్ తివారి (487), మయాంక్ అగర్వాల్ (433), మనీష్ పాండే (417) పరుగులు చేశారు.
ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడుతూ వెయ్యి, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లు ఉన్న జట్టు కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ లో ఏకంగా 9 మంది వెయ్యికి పైగా పరుగులు చేసినవారే. గౌతం గంభీర్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, యూసుఫ్ పఠాన్, శుభ్‌మన్ గిల్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, సౌరవ్ గంగూలీ, మనోజ్ తివారిలు ఈ ఘనత సాధింంచారు.
ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేత చెన్నై ఈ జాబితాలో తర్వాత స్థానంలో ఉంది. వెయ్యి, అంతకుమించి పరుగులు చేసినవారు ఆ జట్టులో రైనా, ధోని, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, బద్రీనాథ్, రుతురాజ్ గైక్వాడ్ (మొత్తం ఏడుగురు) లు ఉన్నారు.
Image credit: PTI
ముంబై ఇండయన్స్ నుంచి రోహిత్ శర్మ, అంబటి రాయుడు, సూర్యకుమార్ యాదవ్, సచిన్ టెండూల్కర్, ఇషాన్ కిషన్, హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు ఈ ఘనత అందుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ లో వీరేంద్ర సెహ్వాగ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, గౌతం గంభీర్, దినేశ్ కార్తీక్ లు వెయ్యికి పైగా పరుగులు చేశారు.
రాజస్తాన్ రాయల్స్ లో రాహుల్ ద్రావిడ్, అజింక్యా రహానే, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యూసుఫ్ పఠాన్ లు ఈ ఘనత సాధించివారే.
పంజాబ్ కింగ్స్ టీమ్ లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా, మన్‌దీప్ సింగ్ లు వెయ్యి పరుగుల మార్కును చేరారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి శిఖర్ ధావన్, మనీష్ పాండే లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ధావన్ ఢిల్లీకి మారకుమందు హైదరాబాద్ కు ఆడిన విషయం విదితమే.