- Home
- Sports
- Cricket
- ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు, అతని వల్ల ఏం లాభం లేదు... ఆర్‌సీబీ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్...
ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు, అతని వల్ల ఏం లాభం లేదు... ఆర్‌సీబీ ప్లేయర్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు దినేశ్ కార్తీక్. ఆ పర్పామెన్స్ కారణంగానే అతనికి టీమిండియాకి తిరిగి సెలక్ట్ చేసింది బీసీసీఐ. అయితే ఈసారి కార్తీక్‌లో ఆ ఫైర్ కనిపించడం లేదు..

(PTI Photo/Shailendra Bhojak)(PTI04_01_2023_000236B)
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత టీమిండియాలోకి వచ్చి ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలు ఆడిన దినేశ్ కార్తీక్,అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు..
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో దినేశ్ కార్తీక్ నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. కార్తీక్ మాత్రమే కాదు, షాబజ్ అహ్మద్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అతని యావరేజ్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైంది..
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000254B)
‘ఆర్‌సీబీ కేజీఎఫ్, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్‌లపైనే ఆధారపడింది. ఈ ముగ్గురూ ఫెయిల్ అయితే ఆర్‌సీబీ కథ అంతే. దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, షాబజ్ అహ్మద్ ఎవ్వరూ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు..
Image credit: PTI
ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్ చాలా వీక్‌గా ఉంది. కార్తీక్ ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడినా ఒక్కదాంట్లో కూడా సరిగ్గా ఆడలేదు. భారీ స్కోరు చేయాలన్ని, భారీ టార్గెట్ ఛేదించాలన్నా మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేసే బ్యాటర్లు కావాలి...
దినేశ్ కార్తీక్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అతనికి ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి రూపాయి లాభం లేదు. వికెట్ కీపింగ్‌లో కూడా అంతే. కాబట్టి సరైన ప్లేయర్‌ని కనిపెట్టాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పైనే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్..